Tuesday, April 1, 2025

చిరుతను తప్పించబోయి కారు బోల్తా… భార్య మృతి… భర్తకు గాయాలు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: చిరుతను తప్పించబోయి కారు బోల్తాపడడంతో భార్య మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడిన సంఘటన కామారెడ్డి జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. గాంధారి మండలం యాచారం గ్రామానికి మాలోత్ ప్రభాకర్- లలిత అనే దంపతులు మంగళవారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఎల్లమ్మకుంట శివారులోకి రాగానే చిరుత రోడ్డుపైకి రావడంతో కారు పక్కకు తప్పించారు. దీంతో కారు బోల్తాపడడంతో భార్య లలిత ఘటనా స్థలంలోనే మృతి చెందగా భర్త ప్రభాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. వాహనదారులు భర్తను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News