Thursday, September 19, 2024

జల్‌పల్లిలో పులి జాడలు

- Advertisement -
- Advertisement -

leopard roaming in jalpally areaహైదరాబాద్: నగర శివారు ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సిసి కెమెరాలకు చిక్కిన చిరుత తాజాగా బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇక, తాజాగా జల్‌పల్లి, మామిడిపల్లి పురపాలక రోడ్డులో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు పహాడీషరీఫ్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రహరి దూకుతూ చిరుత కనిపించింది. పోలీసులు అదే మార్గం గుండా జూలపల్లి కార్గో రోడ్డుకు రాగా అక్కడ అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టు గుర్తించారు.

వెంటనే జల్‌పల్లి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానికులను కూడా అప్రమత్తం చేశారు పెట్రోలింగ్ సిబ్బంది. అయితే, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, పరిసర ప్రాంతాల్లో కనిపించి మాయమైన చిరుత జల్‌పల్లి వైపు వచ్చిందా? శంషాబాద్ చిరుత ఒకటేనా అన్న కోణంలో అటవీశాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. గత సంవత్సరం రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 6 నెలల పాటు సంచరించిన చిరుత ఆ తర్వాత అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోన్‌లో చిక్కుకుంది. అయితే, ఇప్పుడు చిరుత సంచారంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సిబ్బందితో పాటు.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News