Sunday, January 19, 2025

చిరుత కాదు.. అది జంగపిల్లి

- Advertisement -
- Advertisement -

నగరంలో చిరుత సంచరిస్తున్నట్లు ప్రచారం కావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద చిరుత సంచరిస్తున్నట్లు వీడియో రావడంతో నిజమని అందరూ భావించారు. దీనిపై ఒక్కసారిగా అప్రమత్తమైన అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. వెంటనే అక్కడ ప్రాంతాన్ని, వీడియోను పరిశీలించిన అటవీ శాఖ అధికారులు చిరుత కాదని, జంగపిల్లి తేల్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న అటవీ శాఖ టీం పరిశీలిస్తున్నారని ఫారెస్ట్ శాఖ ప్రిన్సిపల్ ఛీఫ్ కన్జర్వేటర్ ఆర్‌ఎం దోబ్రియల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News