Sunday, January 19, 2025

ఢిల్లీ సైనిక్ ఫాం ప్రాంతంలో చిరుతపులి సంచారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సైనిక్ ఫాంహౌజ్ ప్రాంతంలో చిరుతపులి సంచారం ప్రజలకు కనిపించడం ఆందోళన కలిగించింది. దానిని బంధించడానికి బోను అక్కడ ఏర్పాటు చేసినట్టు అటవీ విభాగం అధికారి శనివారం తెలిపారు. గత రాత్రి చిరుత సంచరిస్తున్నట్టు స్థానికులు ఫిర్యాదు చేయడంతో పట్టుకోడానికి అటవీ సిబ్బంది బృందాన్ని ఏర్పాటు చేసామని, అలాగే బోను కూడా సిద్ధం చేశామని అధికారులు తెలిపారు.90 కిలోల వరకు బరువు పెరిగిన పెద్ద చిరుతపులి అని, ఢిల్లీ పోలీస్‌లకు చెందిన 40 మంది అక్కడ మోహరించి ఉన్నారని అధికారులు తెలిపారు. ఫాంహౌజ్ వైపు ఎవరూ రావద్దని స్థానికులను హెచ్చరించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News