- Advertisement -
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలో ఇక్రిశాట్‌లో చిరుత పులి బోనుకు చిక్కింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు మూడు రోజుల నుంచి ఇక్రిశాట్‌లో చిరుత సంచారం చేయడంతో సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు ఇక్రిశాట్‌కు చేరుకొని పాదముద్రలు ఆధారంగా చిరుత సంచరించిందని నిర్థారించుకున్నారు. ఇక్రిశాట్ పరిసరాల్లో సిసి కెమెరాలతో పాటు బోనును ఏర్పాటు చేశారు. బోనులో చిరుత చిక్కడంతో శాస్త్రవేత్తలు, సిబ్బంది, స్థానికులు, అటవీ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చిరుతను హైదరాబాద్ జూపార్కుకు అటవీ శాఖ అధికారులు తరలించారు.
- Advertisement -