Wednesday, January 22, 2025

దాడి చేసిన గంటల్లోనే ఆపరేషన్ ‘చీతా’ సక్సెస్!

- Advertisement -
- Advertisement -

తిరుమల అలిపిరి మార్గంలోని ఏడో మైలు సమీపంలో బాలుడిపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు పట్టుబడింది. శుక్రవారం రాత్రి 10.45 గంటలకు అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ చిరుతను పట్టుకునేందుకు అధికారులు శుక్రవారం సాయంత్రం అలిపిరి నడకదారిలో రెండు బోనులను ఏర్పాటు చేయడంతోపాటు 100కు పైగా కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కరోజులో చిరుతపులి పట్టుబడడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: తెలంగాణలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచన

ఈ చిరుతపులికి ఏడాదిన్నర వయస్సు ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. వేటలో ఉండే లక్షణాలు ఇప్పుడిప్పుడే అలవాటయ్యాయని.. అందుకే లాక్కెళ్లిన బాలుడు తప్పించుకోగలిగాడు. ఈ చిరుత, పిల్లిని వేటాడుతుండగా భక్తుల దారి వైపు వెళ్లినట్లు చెబుతున్నారు. పిల్లి తప్పించుకోగానే బాలుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ చిరుత ఇటీవల తన తల్లి నుంచి విడిపోయిందని.. పిల్లిగా భావించి బాలుడిని వేటాడేందుకు ప్రయత్నించిందని అధికారులు తెలిపారు.

Also Read: సిగ్నల్ వద్ద ఆత్రం ఏ మాత్రం పనికిరాదు.. ఎమ‌న్నా అదృష్ట‌మా ఇది!

గురువారం రాత్రి అలిపిరి కాలిబాటపై ఆడోన్ కాని కుటుంబం తిరుమలకు నడుచుకుంటూ వెళుతోంది. ఈ క్రమంలో బాలుడు తన తాతయ్యతో కలిసి ఓ దుకాణం దగ్గర స్నాక్స్ కొంటున్నాడు. ఇంతలో ఏడో మైలు సమీపంలో ఓ చిరుత బాలుడిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. దీంతో భక్తులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. బాలుడి తాత పెద్దగా కేకలు వేయడంతో కాలిబాటపై తిరుమల వెళ్తున్న తిరుమల టూటౌన్ ఎస్‌ఎస్ రమేష్ గమనించాడు. వెంటనే అక్కడికి వెళ్లి ఏం జరిగిందని ఆరా తీశారు.

Also Read: నేటి నుంచి గ్రూప్-4 హాల్ టికెట్లు

ఈఎస్‌ఐ భక్తులతో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లి చూడగా 150 మీటర్ల దూరంలో బాలుడు కనిపించాడు. బాలుడికి గాయాలైన వెంటనే తిరుపతిలోని చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించారు. బాలుడి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. నడకదారిలో వెళ్లే భక్తులకు కొన్ని సూచనలు చేశారు. భక్తులు గుంపులుగా నడవాలని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.

Also Read: పెళ్లి చేసుకో.. ఆలస్యం చేయొద్దు

అటవీ శాఖ అధికారులు రెండు చోట్ల భోగి మంటలు ఏర్పాటు చేశారు. 100కు పైగా చోట్ల కెమెరాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం బోనులను ఏర్పాటు చేయగా రాత్రి 10.45 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కుకుంది. ఆపరేషన్ చీతా విజయవంతమైందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. బోనులో చిరుత చిక్కుకోవడంతో భక్తులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుతను తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేస్తారు. దీంతో చిరుత కథ సుఖాంతం అయింది.

Also Read: కుమ్మక్కు రాజకీయాలు.. ముమ్మాటికీ మీవే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News