- Advertisement -
న్యూస్‌డెస్క్: పంజాబ్‌లోని నంగల్‌లో ఉన్న ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ఐటిఐ)లో అటవీశాఖ అధికారులు అమర్చిన బోనులో శుక్రవారం ఒక ఏడేళ్ల చిరుత పులి చిక్కుకుంది. ఐటిఐ క్యాంపస్‌లో ఈ చిరుత సంచరిస్తున్నట్లు సోమవారం అధికారులు గుర్తించారు. సోమవారం రాత్రి క్యాంపస్‌లో ఒక కుక్కను చిరుత చంపివేసిందని, చిరుత కదలికలు క్యాంపస్‌లోని సిసి టివి కెమెరాలు రికార్డు చేశాయని అధికారులు చెప్పారు. ఐటిఐ అధికారుల సమాచారం అధారంగా అటవీ అధికారులు క్యాంపస్‌లో ఒక బోనును మంగళవారం అమర్చారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో పులి బోనులో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. అడవిలో వదిలిపెట్టే ముందు పులికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అటవీ అధికారులు చెప్పారు.
- Advertisement -