- Advertisement -
యాచారం: రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో చిరుతపులి సంచరిస్తోందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజులుగా పశువులు, మేకలపై దాడికి పాల్పడుతోందని చెబుతున్నారు. బుధవారం తాడిపత్రిలో చిరుతపులి మేకపోతును చంపి తిన్నది. నిన్న పొలం వద్ద ఆవుపై దాడిచేసి ప్రాణాలు తీసిందని వాపోతున్నారు. చిరుతపులి వరస దాడులతో రైతులు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు పట్టించుకోవట్లదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను బంధించాలని యాచారం మండలం రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
- Advertisement -