Monday, December 23, 2024

శివారు ప్రాంతాల్లో కానరాని బస్సులు

- Advertisement -
- Advertisement -

గతంలో రద్దు చేసిన బస్సులను పునరుద్దరించాలంటున్న ప్రయాణికులు

Bus ticket price hike to go up in telangana
మన తెలంగాణ,సిటీబ్యూరో: అధికారులు శివారు ప్రాంతాలకు పూర్తి స్థాయిలో బస్సులను నడపడంలో విఫలం కావడంతో అటు సంస్థకు ఆర్దిక ఇబ్బందులే కాకుండా ఇటు ప్రయాణికులు కూడా రవాణ పరంగా ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి ఉద్యోగ ,వ్యాపారాలు చేసుకోవాలన్నా. అదే విధంగా నగరం నుంచి శివారు ప్రాంతాలు వెళ్ళాల్సి వచ్చిన గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ప్రస్తుత కోవిడ్ (వోమిక్రాన్ ) పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలకు బస్సులను రద్దు చేసి,మరి కొన్ని రూట్లలో పునరుద్దరించారు.

కానీ ఇంకా అనేక ప్రాంతాల్లోని కాలనీలు,బస్తీలకు బస్సులు దూరంగానే ఉన్నాయి.కొన్ని ప్రాంతాల్లో బస్సులను నడపాలని ఆయా డిపోమేనేజర్లకు వినత్రి పత్రాలు సమర్పిస్తుంటే మరి కొంత మంది ఎండి సజ్జన్నార్‌కు పలుసామాజిక మార్గాల ద్వారా విజ్ఞప్తులు చేస్తున్నారు. కోవిడ్ నియంత్రణ కోసం గతంలో బస్సులను రద్దు చేసిన బస్సులను తిరిగి పునరుద్దరించాలని వారు శివారు ప్రాంతవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరో వైపు ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులు అందుబాటులో లేక పోవడం, పలు కారణాలతో సిబ్బంది విదులకు గైర్హాజరు కావడం,అకస్మాత్తుగా ట్రిప్పుల రద్దు వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్‌టిసి ప్రయాణికు రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచడంలో విఫలం అవుతోంది.

శివారు ప్రాంత వాసులకు ఎదురు చూపులే..

ప్రస్తుత పరిస్థితుల్లో శివారు ప్రాంత వాసులకు బస్సుల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ముఖ్యంగా నిజాంపేట, బాచుపల్లి, తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది ఉద్యోగులు, ఐటీ నిపుణులు మాదాపూర్, గచ్చిబౌలీ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు స్వయంగా కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించాలని సంబందిత ఐటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడంతో వారికి తగిన బస్సులు లేక పోవడంతో ఇబ్బంది పడుతున్నారు.బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే విధంగా ఉప్పల్ నుంచి ఘట్కేసర్ టౌన్‌షిప్‌లో సుమారు 9 వేలకు పైగా నివాసం ఉంటున్నారు. వేలాది మంది ఇన్ఫోసిస్ ఉద్యోగాలు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి సంస్కృతికి టౌన్‌షిప్‌కు గతంలో బస్సులను నడిపిన అధికారులు కోవిడ్ కారణంగా వాటిని రద్దు చేయడంతో అనే మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, చేవెళ్ళ, జీడిమెట్ల,కూకట్‌పల్లి, పటాన్ చెరు, తదితర ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగిస్తున్నా చుట్టుపక్కల కాలనీలు,బస్తీలకు బస్సులు చేరుకోలేక పోతున్నాయి. బస్సులు అందుబాటులో లేక పోవడంతో వారు ప్రైవేట్ రవాణ వ్యస్థను ఆశ్రయిస్తుండటంతో వారు ఆర్దికంగా నష్టపోవడమే కాకుండా సంస్థకు వచ్చే ఆదాయం రావడం లేదు. ఉదయం ఒక టిప్పు వస్తే, సాయంత్రం వస్తుందో రాదో చెప్పలేక పోతున్నామని ఆయా ప్రాంత ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కుదుటు పడుతున్న ఆర్‌టిసి శివారు ప్రాంతాల్లో గల చుట్టపక్కల గల కాలనీలు,బస్తీలకు కూడా బస్సులను తిప్పిడే మరింత గాడినపడుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News