Monday, December 23, 2024

గుణపాఠం నేర్పిన ఉప ఎన్నిక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి:నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికపై దేశమే కా దు.. ప్రపంచ వ్యాప్త ప్రజల దృష్టిని ఆకర్షించిన విషయం విదితమే. కరెన్సీ కట్టలు, మస్తు మస్తు మద్యంతో కథంతొక్కుతూ జరిగిన పో రులో మూడు ప్రధాన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. రణరంగంగా కొనసాగిన హెరహోరి పోరులో అంకెల పరంగా అధికార పా ర్టీ గెలిచి సత్తా చాటినప్పటికి మరో ఏడాదిలో జరిగే యావత్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిలకు ముందు జరిగిన మునుగోడు ఉప ఎన్నికల చదరంగంలో దిగిన..దిగని పార్టీలతో పాటు మద్దతు ఇచ్చిన రాజకీ య పార్టీలకు గుణ పాఠం నేర్పిందని చెప్పకనే చెప్పవచ్చు.

మును గోడు ఉప ఎన్నికల్లో ఓడి గెలిచిందెవరు, గెలిచి ఓడిందెవరు, కంచుకోటకు బీటలు వేసుకుందేవరు, పక్క పార్టీకి మద్దతు ఇచ్చి పతనమై ందెవరు అన్న అనేక అనుమానాలు, చర్చలకు తావిస్తున్న ప్రస్తుత త రుణంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నిక అన్ని పార్టీలకు గుణపాఠం నే ర్పిందని పేర్కొనవచ్చు.అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప పోరులో అధికార పార్టీ విజయం సాధించినా.. స ంబరాలు తప్పా సంతృప్తి లేకుండా పోయిందని ఆ పార్టీ అంతర్గతం గా మదన పడుతుందని తెలుస్తుంది. పార్టీ ఎమ్మెల్యేలు, క్యాబినెట్, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు.. స్థానిక ప్రజాప్రతినిధులు ఇలా సర్పంచి నుంచి సీఎం వరకు మొత్తం టిఆర్‌ఎస్ యం త్రాంగమంతా మునుగోడులో మొహరించి ఇప్పుడు వచ్చిన దానిక న్నా రెండింతలు మూడు ఇంతలా ఓట్ల మెజారిటీ వస్తుందనుకుంటే పట్టుమని పదివేల ఓట్లతో బయటపడటం అధికార పార్టీని ఆలోచన లో పడేసిందని తెలుస్తోంది.

ఎనిమిదేళ్లుగా అధికారంలో కొనసాగు తూ దేశ ం లో ఎక్కడా లేని విధంగా స ంక్షే మ పథకాలు అమలు చేసి నా చి వరివరకూ ఉత్కంఠ తప్పలేదు. దక్షిణ తెలంగాణలో అం తంత మాత్రంగానే ఉన్న బిజెపికి కంటి మీద కునుకు లేకుండా చేసిందనే చెప్పవచ్చు.ఈ నేపథ్యంలోనే వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్ర స్తుత ము ప్పుతిప్పలు, ముచ్చెమటలు తప్పేలా లేవు. 2018 ఎన్నిక ల్లో మునుగోడులో 12వేల ఓట్లకే పరిమితమైన కమలం పార్టీ తా జాగా 86వేలకుపైగా ఓట్లు సాధించడం 10వేల ఓట్లతో బిజెపి అ భ్యర్థి ఓడినా, కా నీ ఉప ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చి వచ్చే ఎన్నికలకు సవాల్ విసిరారనే చెప్పాలి టిఆర్‌ఎస్,బిజెపి మధ్యనే పోటీ అనే వా తావరణం స్పష్టమవుతుంది. రాబోయే ఏడాదిలో జరిగే ఎన్నికలకు ఇప్పటి ను ంచి క్యాడరును సిద్ధం చేసేందుకు ఈ ఉప పోరు బాగా క లిసొచ్చిందని కూడా చెప్పవచ్చు.కేవలం 23వేల ఓట్లకే కాంగ్రెస్ పరిమితమై డిపాజిట్ కోల్పోవటం ఆ పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చిందని కుండబద్దలు కొట్టినట్లు ఈ ఉప ఎన్నిక రిజల్ట్ ద్వారా చెప్పవ చ్చు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరుస పరాజయాలు మూటగట్టుకుంటూ ఏ కంగా డిపాజిట్లు కోల్పోతుండడo ఆ పార్టీని రోజురోజుకు మరింత కుంగదీస్తోంది.

అభ్యర్థి తరఫున నల్లగొండ జిల్లా నాయకులు కూడా ప్రచారానికి రాకపోవటం ఆ పార్టీ క్యాడర్ కుంగదీస్తు ంది. మునుగోడులో అయిదు సార్లు పాల్వాయి స్రవంతి తండ్రి పా ల్వాయి గోవర్ధన్ రెడ్డి గెలిచిన చరిత్ర ఉంటే అక్కడ ఆమె రెండు సార్లు డిపాజిట్ కోల్పోయింది. ఉప ఫలితాల్లో మూడో స్థానoలోనే పరిమితమై సార్వత్రిక ఎన్నికల సమయానికి మరింత దిగజారే పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక సారి పీడీఎఫ్, ఆరుసార్లు సీపీఐ గెలిచిన ఈ సెగ్మెంటులో క మ్యూనిస్టులు అంతా అన్నట్లు తోక పార్టీలుగానే మిగిలిపోయాయి. ప్రజా సమస్యలపై పోరాడే ఎర్రజెండా.. ఇంతకాలం ప్రగతి భవన్ అ పాయింట్మెంట్ లేదు. మునుగోడు ఉపపోరుతో అధికార పార్టీ రాచమర్యాదలు చేసింది. ఆఖరికి వీరు పోటీ చేయకు ండా.. వారి మద్దతు అధికార పార్టీకి దక్కేలా చేయటంలో గులాబీ బాస్ సక్సెస్ అ య్యారు. చివరికి కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో ము నుగోడులో గెలిచినా.. తమ ఉనికిని కోల్పోతున్నారు. ఇక పొత్తులు కుదిరితే.. సిట్టింగు స్థానాలపై భవిష్యత్తులో సీట్ల పంచాయతీ తప్పదు. ఇక బీఎస్పీ ఓట్లు 5వేల మించకపోవటం, టీజేఎస్‌కు ఓట్లు అంత ంతే రావటంతో.. వీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలపై పొత్తులపై ఆధారపడాల్సిందే. సొంతగా బరిలో దిగితే.. ఫలితం లేనట్లేనని ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో తేలింది. కాగ సాధారణ అసెంబ్లీ ఎన్నిక ల కన్న ముందు జరిగిన ఈ ఉప ఎన్నిక పలు రాజకీయ పార్టీలకు ముందస్తుగా గణపాఠం నేర్పినట్లేననీ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News