గోదావరిఖని క్రైం: క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని గోదావరిఖని వన్‌టౌన్ ఎస్‌ఐ వెంకటేష్ అన్నారు. విఠల్ నగర్‌లో కలకలం రేపిన క్షుద్ర పూజల విషయంలో స్థానికులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వన్‌టౌన్ ఎస్‌ఐ వెంకటేష్ బుధవారం విచారణ చేపట్టారు.
విఠల్‌నగర్‌లో స్థానికులను కలిసి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మవద్దని సూచించారు. ప్రజలను ఎవరైనా ఇలాంటి పూజల పేర భయబ్రాంతులకు గురి చేస్తే చర్యలు తప్పవని అన్నారు.
అయితే క్షుద్రపూజలు పేర ఈ ప్రాంతంలో కొంత మంది గ్రూపులుగా ఏర్పడి ఇలాంటి చేస్తున్నారని స్థానికుల నుంచి తమకు సమాచారం అందిందని, అలాంటి వారి విషయంలో ఉపేక్షించేది లేదని అన్నారు. ప్రజలు కూడా ఇలాంటివి నమ్మవద్దని, భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఇలాంటివి పాల్పడ్డ వారి పట్ల చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట బ్లూకోట్ సిబ్బంది, పెట్రోకార్ ఎఎస్‌ఐ గౌస్ ఖాన్ తదితరులున్నారు.