Wednesday, January 22, 2025

ప్రజా సంక్షేమానికి మనమందరం బాటలు వేద్దాం

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట రూరల్: ప్రజా సంక్షేమానికి మనమందరం బాటలు వేద్దామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి శాంతాబాయి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నాయకులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని వారికి అందుబాటులో ఉండి సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలు, పట్టణాలు అభివృద్ధిని సాధిస్తూ ఆదర్శ గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వంచే అవార్డులను అందుకోవడం గొప్ప శుభప రిణామమని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు అభివృద్ధికి పట్టం కడుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఎంపిడిఓ మధుసూదన్ గౌడ్, ఎంపిఓ వెంకటేశ్వర్లు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, పిఎసిఎస్ చైర్మెన్ రాజి రెడ్డి, నాయకులు లోక్య నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News