కుత్బుల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చివరి రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం చిత్తారమ్మ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన అమరుల సంస్మరణ సభకు గురువారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని అమరులైన ఐదు మంది కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. అమరవీరులు జాఫర్ ఖాన్, సంజీవరావు, నవీన్, సురేష్ చంద్ర, గొర్ల మల్లేష్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి మోమెంటోలు అందజేశారు.
ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరుల త్యాగఫలమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని, వారి త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని, అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. చివరగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన 150 మంది ఉద్యమకారులు, 150 మంది జేఏసి నాయకులను ఎమ్మెల్యే సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సంజీవరావు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీల బీఆర్‌ఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ యూత్ అ ధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.