Monday, December 23, 2024

నేడు ‘గ్రీన్ ఛాలెంజ్’తో ముందుకు సాగుదాం..

- Advertisement -
- Advertisement -
రేపటి ‘హరితహారం’ వైపు అడుగులు వేద్దాం
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ఎంపి సంతోష్ పిలుపు

హైదరాబాద్ : ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ శుభాకాంక్షలను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ తెలిపారు.
భవిష్యత్తులో జీవిత ప్రయోజనం కోసం మనం సంరక్షించాల్సిన అవసరం ఉందని, ప్రకృతిని సంరక్షించడానికి అత్యంత ముఖ్యమైన కారణం వన్య ప్రాణులను రక్షించడం, జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడం. భవిష్యత్ తరాలను ప్రస్తుత కాలంలోని వృక్షజాలం, జంతుజాలాన్ని చూసేందుకు వీలు కల్పించడంతోపాటు ఆరోగ్యకరమైన, క్రియాత్మక పర్యావరణ వ్యవస్థను నిర్వహించడం ద్వారా సాధ్యపడగలదన్నారు. మొక్కలు, జంతువుల ద్వారా స్రవించే రసాయనాల రూపంలో ప్రకృతి ద్వారా చాలా మందులు అందించబడతాయన్నారు, తద్వారా సహజ ఆవాసాలను పరిరక్షించు కోగలమని వెల్లడించారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా రేపటి హరితహారం వైపు అడుగులు వేద్దామని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ‘ఒక చెట్టును నాటండి మన విలువైన పర్యావరణాన్ని పరిరక్షించడానికి సహకరించండి’ కలిసికట్టుగా ముందుకు సాగుదాం.. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’ అని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సంద ర్భంగా ‘కలిసికట్టుగా పనిచేద్దాం.. ప్రకృతిని పరిరక్షిద్దాం’ అని మరోసారి ఎంపి సంతోష్ పునరుద్ఘాటించారు. ఇందుకు సంబంధించిన ఇమేజ్‌ని ఆయన తన ట్విట్టర్‌లో పొందుపర్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News