నల్గొండ : భూమికోసం భుక్తి కోసం సాగిన తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. మంగళవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి సందర్భంగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా నెల్లికంటి సత్యం మాట్లాడితే నైజాం తొత్తులైన విష్ణురు రామచంద్రారెడ్డి దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య అమరత్వం తెలంగాణ విముక్తికి నాంది పలికిందని అన్నారు.
తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంతో లక్షలాది ఎకరాలు భూమిని పేద ప్రజలు పంపిణీ జరిగి భూస్వాములు దేశ్ముఖ్ గ్రామాల నుండి తరిమి కొట్టడాo జరిగింది అన్నారు.దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను ఆర్థిక అసమానతలు వ్యతిరేకంగా దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఎల్ శ్రావణ్ కుమార్,కార్యవర్గ సభ్యులు బొలుగూరి నరసింహ,పట్టణ కార్యదర్శి గదేపాక .రమేష్,జిల్లా యాదయ్య,లెనిన్ ఎం ముత్యాలు, జిల్లా లక్ష్మణ్, ఎస్ కె మదర్,యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.