Thursday, December 19, 2024

మాదక ద్రవ్యాలు లేని తెలంగాణాను నిర్మిద్దాం

- Advertisement -
- Advertisement -

నల్గొండ : మాదక ద్రవ్యాలు లేని తెలంగాణను నిర్మిద్దామని అదనపు కలెక్టర్ ఖుష్బూగుప్తా చెప్పారు. మహిళా, శిశు ది వ్యాంగుల, వయో వృద్దుల శాఖ ఆద్వర్యంలో నల్గొండ పట్టణంలోని నాగార్జున కళాశాలలో, మిషన్ పరివర్తన, నాషా ముక్త భారత్ అభియాన్ ద్వారా సోమవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీని, గోడ ప్రతులు, కరపత్రాలను, సంతకాల సేకరణ, ఎన్జీ కళాశాల చౌరస్తాలో మానవహారం నిర్వహించగా అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా ప్రారంభించి మాట్లాడారు.

మత్తు పదార్దాలు వినియోగం 1985 మాదక ద్రవ్యాల చట్టం ప్రకారం, అక్రమ రవాణా చేస్తే 20 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించడం జరుగుతుందని, మత్తు, గంజాయి, మత్తు ఇంజెక్షెన్లుకు యువత బానిస కాకూడదని వాటి వల్ల దుష్పలితాలు వుంటాయని వా రి లో రోగ నిరోదక శక్తి క్షీణించడం జరిగుతుందన్నారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్దిని, విద్యార్డులు అవగాహన కల్గినపు ్పడే చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని అన్నారు.

మత్తు, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చట్టాలను పూర్తి స్థాయిలో అమలు జరిపితే ప్రజల్లో అవగాహన చట్టం పట్ల నిబద్ధతను కలిగి ఉండాలన్నారు.జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువ యువకులు కల్గిన మన దేశంలో సుమారు రూ.14 కోట్ల వరకు ఆదాయం గంజాయి, మత్తు ఇంజెక్షెన్లు ద్వారా సమకూరుతుందని దీనిని అరికట్టలంటే యువతి యువకులు వాటి పట్ల మౌనాన్ని వీడి తెలుసుకోవడం మాట్లాడడం ద్వారా అవగాహన కల్పించాలన్నారు.

ఎవరైనా వీటి బారిన పడిన వారి కోసం డి- అడిక్షన్ సెంటర్‌ని ప్రభుత్వ ఆద్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని మన జిల్లాలో న్యూ హోప్ స్వచ్చంద సంస్థ చిట్యాల లో ఉచిత డి – అడిక్షన్ సెం టర్‌ని ప్రభుత్వం ఆద్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని వాటి సే వలను వినియోగించుకోవాల న్నారు.కార్యక్రమములో డీఎస్పీ నర్సింహారెడ్డి, ఎక్సైజ్ -అసిస్టెంటు సూపరింటెండెంట్ చాణక్య, మెడికల్ ఆఫీసర్ నిహారిక, టూటౌన్ సీఐ నాగదుర్గా ప్రసాద్,ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీడీపీఓ నిర్మల, మునగాల నాగి రెడ్డి, శ్రీహరి, వెంకట్ రెడ్డి, మునీర్, పిడి మల్లేశ్ యాదవ్ , ఎన్ సిసి, ఎన్‌ఎస్‌ఎస్ సిబ్భంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News