Friday, December 20, 2024

బంగారు తెలంగాణ మాదిరిగా బంగారు కొత్తగూడెం నిర్మిద్దాం

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం : ముఖ్యమంత్రి కేసిఆర్ కలలు కన్న బంగారు తెలంగాణ సాకారమైందని కొత్తగూడెం నియోజకవర్గం కూడా జంట నగరాలుగా అద్భుతమైన అభివృద్ధి సాధించేందుకు కృషి చేద్దామని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్, జిఎస్‌ఆర్ ట్రస్ట్ అధినేత గడల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. తొలుత పెద్దమ్మ గుడి,గణేష్ టెంపుల్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ఉదయం 10 గంటలకు శ్రీనగర్ కాలనీలోని జనహిత ప్రాంగణం నుంచి భారీ ఊరేగింపుతో వందల సంఖ్యల వాహనాలు ర్యాలీగా తరలిరాగా ఓపెన్‌టాప్ జీపు పై గడల ప్రజలకు అభివాదం చేస్తూ బస్టాండ్ సెంటర్ వరకు తరలివచ్చారు. సూపర్‌బజార్, బస్టాండ్ సెంటర్‌లో అభిమానులు భారీ గజమాలతో సత్కరించారు.

అక్కడే ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన కొత్తగూడెం క్లబ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేసి పుట్టిన రోజు సంబురాలను ప్రారంభించారు. అనంతరం గడల మాట్లాడుతూ కుటుంబ సభ్యులు రక్తం పంచుకుని పుడితే కొత్తగూడెం ప్రజలు మనస్సు పంచుకున్నారని భావోద్వేగంతో అన్నారు. తాను చేసే సేవా కార్యక్రమాలకు వెన్నంటి ఉంటూ మద్దతు పలుకుతున్న తీరుకు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. తాము స్థాపించిన ట్రస్ట్ విద్యా ,వైద్యం, ఉపాధి,ఉజ్వల భవిష్యత్తు అనే నినాదంతో ముందుకు సాగుతుందని, ఇప్పటి వరకు పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపు ద్వారా దాదాపు 30 వేల మందికి పైగా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

మెగా జాబ్ మేళా ద్వారా 3500 మంది నిరుద్యోగులు ఉపాధి పొందారని వివరించారు. త్వరలో గడపగడపకు గడల, ఇంటింటికి కొడుకు అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. మరో కొత్తగూడెం నిర్మాణం కోసం ప్రతీ ఒక్కరూ సహకరించాలని, తనతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు.అనంతరం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువసేన సభ్యులు, బంజార బిసి సంఘాలు, గిరిజన, దళిత సంఘాల నాయకులు, ట్రస్ట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News