Thursday, January 9, 2025

వ్యవసాయాన్ని పండుగ చేస్తాం

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లాలో వ్యవసాయాన్ని పండుగ చేసుకునేలా రైతులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ జెడి వెంకటేష్ తెలిపారు. ఆయన మన తెలంగాణ ఉమ్మడి జిల్లా ప్రతినిధితో ఖరీఫ్‌కు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌పై మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా అంటే కరువు, వలసలకు నిలయంగా ఉండేదని, రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థ్దితి అందుకు పూర్తి భిన్నంగా మారిందన్నారు, సాగునీటి వనరులు పెరగడంతో చెరువులు,కుంటలు నిండిపోవడం, చెక్ డ్యాంలు నిర్మాణంతో భూగర్భ జలాలు పెరగడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకోగల్గుతున్నారని చెప్పారు. గతంలో వలసలు వెళ్లిన రైతులు తిరిగి తమ గ్రామాలకు చేరుకొని వ్యవసాయాన్ని చేసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు లే కుండా విత్తనాలు,ఎరువులు సిద్ధ్ద్ద్దంగా ఉంచామన్నారు.రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పించామన్నారు. ఖరీఫ్‌లో 3,77,917 హెక్టార్లలో ఈ ఏడాది ఖరీఫ్ పంటలైన పాడి,రెడ్ గ్రాం,క్యాస్టర్, జవార్, మిజ్రా, రాగి, గ్రీన్ గ్రాం, కాటన్ తదితర పంటలు రైతులు పండించే అవకాశం ఉందన్నారు. అత్యధికంగా రైతులు పత్తి పంటకే మెగ్గు చూపుతున్నట్లు ఆయన వెల్లడించారు.అత్యధికంగా 1,15,845 ఎకరాల్లో పత్తి సాగు చేసే అవకాశాలు ఉన్నాయని జెడి తెలిపారు. అయితే రైతులు ఎవరూ ముందస్తుగా వట్టి భూముల్లో వి త్తనాలు నాటవద్దని తెలిపారు. కనీసం 60 శాతం వర్షపాతం పడిన తర్వాతనే విత్తనాలు వేసుకోవాలని రైతులకు విజ్ణప్తి చేశారు.
నకిలీ విత్తనాలపై నిఘా వేశాం : నకిలీ విత్తనాలు తయారు చేసినా, విక్రయించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జెడి హెచ్చరించారు. జిల్లాలో నకిలీ విత్తనాలు రాకుండా గట్టి నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర టీంతో పాటు 5 స్పెషల్ టాస్క్ పోర్స్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ శాఖ యమన్వయంతో తరచూ తనఖీలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికీ 6 సార్లు తనఖీలు చేశామని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క మిడ్జిల్‌లో ఒక కేసు నమోదైందని,అ కేసు తప్ప జిల్లాలో ఎక్కడా ఎలాంటి కేసులు నమోదు కాలేదన్నారు. విత్తనాలను లూజు అమ్మినా, హోలోగ్రాం లేక పోయినా నకిలీ విత్తనాలుగా పరిగణిస్తామని చెప్పారు. తనఖీలు చేసిన ప్రతి సారి విత్తనాలను సేకరించి హెచ్‌టి టెస్ట్‌లు చేయిస్తామని, అందులో నకిలీ విత్తనాలని తేలితే సీజ్ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 303 మంది లైసన్స్ పెప్టిసైడ్ అంగల్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. వాటిలో తమ సిబ్బందిపై ఎప్పటికప్పుడు తనఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.
రసీదు లేకుండా రైతులు విత్తనాలు కొనుగోలు చెయెద్దు
ఎలాంటి విత్తనాలను రైతులు కొనుగోలు చేసినా సంబంధిత షాపు యజమాని నుంచి రసీదు ( బిల్లు) తప్పని సరిగా తీసుకోవాలని రైతులకు కోరారు. రసీదును, విత్తనం ప్యాక్ చేసిన సంచిని జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. విత్తనాలు మెలకెత్తక పోయినా, పిందె రాక పోయినా, సంబందిత వ్యవసాయ అధికారులకు రసీదు, ఖాలీ సంచితో ఫిర్యాదు చేయాలని చెప్పారు. మేము ఒక సైంటిస్టును తనఖీకి పంపించి నివేదిక అధారకంగా చర్యలు తీ సుకుంటామన్నారు. రైతులు వినియోగదారుల కోర్టుకు వెళ్లి నష్టపరిహారం కోరవచ్చునని ఆయన తెలిపారు. రైతులు లూజు విత్తనాలను ఎట్టి పరిస్దితుల్లో కొనుగోలు చెయవద్దని ఆయన కోరారు.
రైతుకు అండ దండ రైతు బంధు, రైతు బీమా
రైతును రాజు చేసేలా ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటోంది. గతంతో పోల్చితే వ్యవసాయంలో ఎంతో మార్పులు వచ్చాయని తెలిపారు. గతంలో రైతు చనిపోతే ఒక్క రూపాయి వచ్చేది కాదని,కుటుంబం బజారున పడేదన్నారు. అప్పుల ఊబి నుంచి కోలుకోలేక రైతులు ఆత్మహత్యలు జరిగేవని తెలిపారు. కాని ఇప్పుడు ప్రభుత్వం రైతులకు అండ దండగా ఉంటూ ఆదుకుంటున్నదని తెలిపారు. రైతు బీమా కింద రైతు ఎలా చనిపోయినా, పాసుబుక్కు ఉంటే చాలు,ఆ రైతు నామిని అకౌంట్లో 15 రోజుల్లోగా రూ. 5 లక్షలు నేరుగా జమ అవుతాయని తెలిపారు. మద్య దళారులు ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం రైతు కుటుంబంకు చేరి ఆదుకుంటున్నదని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 3653 మంది రైతులు వివిద కారణాల వలన చనిపోగా వారికి ప్రభుత్వం నుంచి రూ. 182.95 కోట్లు రైతుల కుటుంబాల బ్యాంక్ అకౌంట్లలోకి జమ అయ్యాయన్నారు. అలాగే రైతు బంధు కింద పాలమూరు జిల్లాలో 2,19,844 మంది రైతులకు గానూ రూ.1917.69 కోట్లు జమ అయ్యాయని జెడి తెలిపారు. జిల్లాలో 3,51,884 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉందని ఆయన తెలిపారు. ఈ ఏడాది మరో పది వేల ఎకరాల్లో పంటలు అదికంగా సాగు అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News