Wednesday, November 13, 2024

బోనాలను ఘనంగా జరుపుకుందాం: గెల్లు శ్రీనివాస్ యాదవ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో నాటి పాలకులు బోనాలు.. ఒక పండుగేనా అంటూ గేలి చేశారని , స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణలో బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇస్తు పండుగకు ప్రాధాన్యతనిస్తోందని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది బోనాలకు రూ. 15 కోట్ల నిధులు కేటాయించినందుకుగాను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.

ఆదివారం హైదరాబాద్ సిటీ కాలేజ్ సమీపంలోని తాటి మైసమ్మ ఆలయంలో నిర్వహించిన బోనాల జాతరకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు రోగాల భారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని నిజాం కాలం నుండి ఆషాఢమాసంలో బోనాల జాతర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, ఆ సంస్కృతిని మనం కొనసాగిస్తున్నామని తెలిపారు. సిటీకాలేజ్ చారుమహల్ రజక సంఘం ఆధ్వర్యంలో బోనాల జాతరను ఘనంగా నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో వీరనారి చాకలి ఐలమ్మ పేరు ప్రస్తావించకుండా బిఆర్‌ఎస్ పార్టీ ఏ సభ జరగలేదని అన్నారు. తెలంగాణ వచ్చాక రజకులకు అన్ని రంగాల్లో సమానంగా అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేసి అన్నివిధాలుగా అండగా ఉంటున్న బిఆర్‌ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకొని, కెసిఆర్‌ను మూడో సారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి బోనాల జాతరను సంతోషంగా జరుపుకోవడం హర్షణీయమని అన్నారు. కాగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను రజక సంఘం నాయకులు ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శాలువా, మెమొంటోతో ఘనంగా సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News