Friday, December 20, 2024

బక్రీద్ శాంతియుత వాతావరణంలో నిర్వహించుకుందాం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : బక్రీదు పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకుందామని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. సోమవా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బక్రీదు పండుగ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు ముస్లిం, హిందూ మత పెద్దలతో పీస్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను శాంతియు త వాతావరణం లో జరుపుకోవాలని అన్నారు. పండుగ సం దర్భంగా మున్సిపల్ కమిషనర్ల పరిధిలోని ఈద్గాల వద్ద శానిటైజేశన్, లైటింగ్, మంచినీటి సౌకర్యం వంటి వాటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుం డా చూడాలని అధికారులకు అన్నారు.బక్రీద్ పం డుగ సందర్భంగా ఆవులను, వధించరాదని, అనారోగ్యంతో ఉన్న పశువులను కూడా వధించరా దని ఆయన అన్నారు.

జిల్లా సరిహద్దులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని అవి 24 గంటలు పని చేస్తాయని కలెక్టర్ తెలిపారు. ఈ చెక్ పో స్టుల వద్ద పశువులను పశుసంవర్థక శాఖ డాక్టర్లచే జారీ చేసిన సర్టిఫికెట్ ఉన్న వాహనాలను మాత్రమే పంపించాలని ఆయన తెలిపారు. పండుగ సందర్భంగా మున్సిపల్ నీరును సరఫరా చేయాలని అన్నారు. పశువులను వధించే సెంటర్ల వద్ద బ్లీచింగ్ పౌడర్ సప్లై చేయాలని అన్నారు. వేస్టేజ్ కలెక్షన్ కోసం బ్యాగులు ఇవ్వాలని అధికారులకు సూచించారు.

వాటిని వెంట వెంటనే అక్కడి నుండి త రలించాలన్నారు. మేజర్ గ్రామ పంచాయతీలలో ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో కూడా పై ఏర్పాట్లను చేయాలని పంచాయతి అధికారులను ఆదేశించారు. ఆవులు, దూడలు, అనారోగ్యంతో ఉన్నవాటిని వధిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.బక్రిద్ రోజున శానిటైజేషన్ ము ఖ్యమని ఆయన తెలిపారు. మున్సిపల్ సిబ్బంది వెంట వెంటనే శుభ్రం చేయాలని అన్నారు.

బక్రిద్ పండుగలో ఎలాంటి అవాంచనీయమైన సంఘ టనలు జరుగకుండా చూడాలని పోలీసు అధికారుల ను కోరారు. పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు మాట్లాడుతూ పండుగలను సోదర భావం తో కలిసిమెలిసి సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. కరీంనగర్ జిల్లాలో పండుగలను హిందూ ముస్లింలు సోదర భావంతో, ఐకమత్యంతో జరుపుకుంటారని అన్నారు.

ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసులకు తెలియజేయాలని, ఎవరు కూడా చట్టాన్ని తమ చేతిలో తీసుకోవద్దని, పశువులను ఆక్రమంగా రవాణా చేస్తే సంబంధిత ఎస్ హెచ్ ఓ కు తెలియజేయాలని అన్నారు. అపోహలను సృష్టించే వాట్సాప్ మెసేజ్ లను చూసి తొందర పడ వద్దని అన్నారు.

జిల్లాలో ఆరు చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంగాధర మండలంలో ని తుర్కశి పల్లి, చొప్పదండి మండలం ఆర్నకొండ, కొత్తపెళ్లి మండలం చింతకుంట, కరీంనగర్ రూరల్ మండలం మగ్దూంపూర్, హుజరాబాద్ మండలం పరకాల ఎక్స్ రోడ్, మానకొండూరు మండలం శంషాబాద్ వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఈ సమావేశంలో డీసీ పీ శ్రీనివాస్, ఆర్డీఓ ఆనంద్ కుమార్, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి నరెందర్, మున్సిపల్ కమీషనర్ సేవా ఇస్లావత్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మధుసూదన్, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం, హిందూ మత పెద్దలు తదితరులు మున్సిపల్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News