Thursday, January 23, 2025

డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిద్దాం

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: ప్రతి ఒక్కరు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగించాలని బిజెపి భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బిజెపి అర్బన్ అధ్యక్షుడు సామల మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో జనసంగ్ వ్యవస్థాపకుల్లో ఒకరైనా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేందర్ హాజరై శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ జనసంగ్ వ్యవస్థాపకులు మానవత వాది దేశం కోసం దేశ రక్షణ కోసం అనేకమైన సేవలు చేసినటువంటి గొప్ప మహా నాయకుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ అన్నారు. వారి అడుగుజాడల్లో, వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలాగా పనిచేయాలని వారన్నారు.

ఈ కార్యక్రమలో రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి బట్ట రవి, ఓబిసి జిల్లా అధ్యక్షుడు దొంగల రాజేందర్, అర్బన్ ప్రధాన కార్యదర్శి తుమ్మేటి రామ్‌రెడ్డి, అర్బన్ ఉపాధ్యక్షులు సుధాకర్, జిల్లా కార్యాలయ కార్యదర్శి ఉనుకొండ రామకృష్ణ, జిల్లా నాయకులు గిస సంపత్, నియోజకవర్గ ఫుల్ టైమర్ బడుగు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News