Wednesday, January 22, 2025

స్వచ్ఛభారత్ స్ఫూర్తి కొనసాగిద్దాం : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మెరుగైన పారిశుద్ధ్యంతోనే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది.. ఆరోగ్యంగా ఉంటేనే మనమంతా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నల్లకుంటలోని శంకర్‌మఠ్ సమీపం నుంచి ఫీవర్ హాస్పిటల్ వరకు జరిగిన ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమంలో భాగంగా.. ఆయన శ్రమదానంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదినం సెప్టెంబర్ 17 నుంచి.. మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు ‘సేవాపక్షం’ పేరుతో దేశవ్యాప్తంగా.. బిజెపి తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున, స్వచ్ఛంద సేవాసంస్థల తరపున సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా స్వచ్ఛతకు ప్రాధాన్యతనిచ్చిన గాంధీజీ.. స్వాతంత్య్ర భారతదేశానికంటే ముందే.. స్వచ్ఛభారత్ సాధించాలని పిలుపునిచ్చారు. అదే స్ఫూర్తితో ప్రధానిగా మోడీ అధికారం చేపట్టినప్పటినుంచి నేటి వరకు నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛంగా కోట్లాదిమంది ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు ఈ శ్రమదానంలో పాల్గొంటున్నారని వెల్లడించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి. స్వచ్ఛభారత్ నిర్మాణాన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News