Thursday, January 23, 2025

వికసిత్ భారత్ స్ఫూర్తిని కొనసాగిద్దాం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలను సాధించిందని గుర్తు చేశారు.2023లో దేశంలో వికసిత్ భారత్ స్ఫూర్తి రగిలిందని, దాన్ని కొత్త సంవత్సరంలోను కొనసాగిద్దామన్నారు. ఆదివారం ప్రసారమైన 2023 చిట్ట చివరి మన్ కీ బాత్‌లో భాగంగా ఈ ఏడాది భారత్ సాధించిన విజయాలను ప్రధాని గుర్తు చేశారు. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న మహిళా బిల్లుకు ఈ సంవత్సరంలోనే ఆమోదం లభించిందని గుర్తు చేశారు.

భారత్ అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. దీనిపై దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ లేఖలు రాస్తున్నారని తెలిపారు. ప్రతిష్ఠాత్మక జి20 సదస్సును విజయవంతంగా నిర్వహించామన్నారు.ప్రస్తుతం భారత్‌లోని ప్రతిప్రాంతంఎంతో ఆత్మవిశ్వాసంతో నిండి ఉందన్నారు. దేశ ప్రజల్లో వికాస. స్వయం సమృద్ధి భారత్ స్ఫూర్తి రగిలిందన్నారు. 2024లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ ఏడాది ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో దేశమంతా ఉర్రూతలూగిందని మోడీ అన్నారు. ‘ ఎలిఫెంట్ విస్పరర్స్’కూ ప్రతిష్ఠాత్మక అవార్డు రావడంతో భారతీయుల ప్రతిభ వెలుగు చూసిందని వ్యాఖ్యానించారు.

2023లలో భారతీయుల సృజనాత్మకత యావత్ ప్రపంచం వీక్షించిందని తెలిపారు.ఈ ఏడాది మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శనచూపారని కొనియాడారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలతో సత్తా చాటారని గుర్తు చేశారు. వన్డే ప్రపంచకప్‌లో భారతక్రికెట్ జట్టు అందరి మనసులను గెలుచుకుందన్నారు. చంద్రయాన్3 విజయవంతంపై చాలా మంది తనకు సందేశాలు పంపుతున్నారని ప్రధాని తెలిపారు. శాస్త్రవేత్తల కృషితో ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగం విజయవంతం అయిందని, ఇది అందరికీ గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా శారీరక, మానసిక ఆరోగ్య పాధాన్యతను ప్రధాని నొక్కి చెపారు.ఈ దిశగా చేపట్టిన‘ ఫిట్ ఇండియా’లో భాగంగా తీసుకున్న పలు చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్,చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ తమ ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్నారు.

అయోధ్యలో రామమందిరంపై దేశం యావత్తు ఉత్సుకతతో ఎదురు చూస్తోందని మోడీ అన్నారు. ప్రజలు రకరకాలలుగా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారన్నారు.గత కొన్ని రోజలుగా శ్రీరాముడు, అయోధ్యపై కొత్త పాటలు, భజన్‌లు, కవితలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. వాటిలో కొన్నిటిని తాను సోషల్ మీడియాలో పంచుకున్నానని కూడా వెల్లడించారు.ఈ చరిత్రాత్మక ఘట్టంలో కళా ప్రపంచం తనదైన శైలిలో భాగస్వామ్యం అవుతోందని అభిప్రాయపడ్డారు. అలాంటి సృజనాత్మకతను సోషల్ మీడియాలో‘ శ్రీరామ్ భవన్’ హ్యాష్‌ట్యాగ్‌తో పంచుకోవాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News