Saturday, November 23, 2024

ప్లాస్టిక్‌ని నియంత్రిద్దాం : డిసిపి బత్తిని సాయి శ్రీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని ఎల్‌బి నగర్ డిసిపి బత్తిని సాయిశ్రీ అన్నారు. రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు శనివారం ఆమె ఆధ్వర్యంలో ఎల్ బినగర్‌లో ప్లాస్టిక్ వాడకాలను నియంత్రించే దిశగా అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్‌కి బదులు అందరు జూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ వాడాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జూట్, పేపర్ సంచులను ప్రజలకు అందజేసి.. అవగాహన కల్పించారు. పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందని వెల్లడించారు. మొక్కలు నాటి ప్లాస్టిక్‌ని నియంత్రించే విధంగా చేపట్టే కార్యక్రమాలు రేపటి తరాలకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందన్నారు. పర్యావరణ హితమైన కార్యక్రమాలలో పోలీస్ సిబ్బందిని భాగస్వామ్యం చేసినందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిసిపి సైబర్ క్రైమ్ అనురాధ, అదనపు డిసిపి కోటేశ్వరరావు, ఎసిపి వనస్థలిపురం భీమ్ రెడ్డి, సిఐ కిరణ్ కుమార్, ఎస్‌ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సింగర్, డ్యాన్సర్ వర్శిని అన్నారు. శనివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కొదురుపాక వద్ద మొక్క నాటిన ’కెమెరా పట్టిండే సాంగ్ ఫేమ్’ వర్శిని.. ఈ సందర్భంగా వర్శిని మాట్లాడుతూ ప్రతి ఒక్కరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఎంపి సంతోష్‌కుమార్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సింగర్,డ్యాన్సర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Green India 3

 

Green-India-2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News