Monday, January 20, 2025

చేయి చేయి కలుపుదాం.. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదాం

- Advertisement -
- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు

హైదరాబాద్ : ప్రపంచ మేల్కొలుపు కోసం సమయమని, ‘చేయి చేయి కలుపుదాం.. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడతాం’ మని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు నిచ్చారు. భారతీయ పర్యావరణ వేత్త సునీతా నారాయణ్ ‘మట్టి వాసన’ శీర్షికలో ‘ప్లాస్టి క్ భూతాలకు అంతమెప్పుడు?’ అన్న కథనం ప్లాస్టిక్ మితిమీరిన వినియోగం యొక్క భయంకరమైన పరిణామాలను కళ్లకు కట్టేలా చూపిం దన్నారు. ప్లాస్టిక్‌కు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని, త్వరితగతిన పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను స్వీకరిద్దామని తెలిపారు. మొక్క లు నాటడం ద్వారా ప్లాస్టిక్ నివారణ ఉద్యమం చేపట్టడంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాము లవ్వాలన్నారు. కలిస్తేనే మార్పు తధ్యమని, ఆ దిశగా అడుగులు వేద్దామని సంతోష్ అన్నారు. సునీతా నారాయణ రాసిన ఆ కథనాన్ని తన ట్విట్టర్‌లో ఎంపి సంతోష్ జత చేశారు.

Sunita Narayan

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News