Friday, November 15, 2024

కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడదాం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తుందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని మిర్యాలగూడ ఎ మ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు రైతువేదికల వద్ద రైతుల సదస్సు, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్న అంశాలపై మిర్యాలగూడ ఎంపిడిఓ కార్యాలయంలో గల రైతు వేదిక వద్ద ఆయా గ్రామాల రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పిసిసి ఛీఫ్ రేవంత్‌రెడ్డి రైతాంగంపై చేసిన విమర్శలు సిగ్గుచేటు అన్నారు.

రైతుకు ఎకరాకు మూడు గ ంటలకు కరెంటు ఏవిధంగా సరిపోతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయంపై కుట్రపూరిత వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని, ఈ విషయాన్ని తెలంగాణ రైతులు గమనిస్తున్నారన్నారు. 3 పంటల నినాదం తమ పార్టీదైతే మూడు గంటల కరెంటు కాంగ్రెస్ పార్టీదని ఆయన అన్నారు. 3 పంటలు బిఆర్‌ఎస్ నినాదం 3 గంటల కరెంట్ కాంగ్రెస్ విధానం అనే నినాదం పేరిట ఫ్లకార్డులతో నిరసన తెలిపి, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, అనంతరం తీర్మాణాలు చేసారు.

ఈ కార్యక్రమంలో రా ష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, నల్లగొండ జిల్లా రైతుబంధు స మితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, యంపిపి నూకల సరళ హనుమంత్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్, డిసిసిబి డైరెక్టర్ బంటు శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మార్కెట్ డైరెక్టర్లు భిక్ష నాయక్, విజయలక్ష్మి, యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News