పంజాగుట్ట: తెలంగాణా ప్రభుత్వం చేనేత కళాకారులను ప్రోత్సహిస్తుందని, ప్రతి సోమవారం ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు చేనేత వస్త్రాలను ధరిస్తున్నామని నగర డిప్యూటీ మేయర్ ఎం. శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నెం-12లోని కలింగ కల్చరల్ హాల్లో జగ్ధీశ్వర్ హస్తకళా ఎక్స్పో ఆద్వర్యంలో హ్యాండ్లూమ్ ఇండియా పేరిట ఏర్పాటుచేసిన వస్త్రప్రదర్శనను ఆమె ప్రారంభించారు.
ఇక్కడ తెలంగాణా సంప్రదాయ వస్త్రాలతో పాటు పలు రాష్ట్రాల చేనేతకారుల ఉత్పత్తులను ప్రదర్శించడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ చేనేతకారుల వస్త్రాలను ధరించి వారి చేయూతను అందించాలని కోరా రు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేనేత కళాకారులకు ప్రోత్సహకాలు, సహయ సహకారాలు అందించి వారి ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిని తీసుకెళుతున్నారని పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన చేనేతకళాకారులు తమ ఉత్పత్తులైన సిల్క్, కాటన్, డిజైనరీ చీరలతో పాటు పలు ప్యాన్సీ వస్తువులను సుమారు 60 స్టాల్స్ ప్రదర్శిస్తున్నారని నిర్వహకులు జయేష్ గుప్తా తెలిపారు. ఈ ప్రదర్శన ఈనెల 28వరకు కొనసాగుతుంది.