Friday, December 27, 2024

అమర వీరుల స్ఫూర్తితో విద్యావిధానంపై పోరాడుతాం: ఎస్‌ఎఫ్‌ఐ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అమరుల స్ఫూర్తితో నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా పోరాడుతామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు పేర్కొన్నారు. భారత దేశ విద్యార్ధి ఉద్యమంలో అనేక విద్యార్ధి ఉద్యమాలు నడిపిన ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ నాయకులు ఆర్.ఎల్. మూర్తి, నాగరాజు మాట్లాడుతూ దేశంలో 1936 లోనే బ్రిటిషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా విద్యార్ధులను స్వాతంత్య్ర ఉద్యమంలో నిలిపిన స్ఫూర్తితో భగత్ సింగ్ ఆశయాలు సాధనకు పోరాడిందన్నారు. స్వాతంత్య్రం సాధించిన తరువాత నాటి కాంగ్రెస్ విద్యారంగంను విస్మరించి, దేశంలో అసమానతలు పెంచిందని, అందరికీ విద్య,  ఉపాధి కల్పించాలన్నారు.

స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందలాలని 1970లో మొదటి మహాసభలు కేరళ రాష్ట్రం త్రివేండంలో జరుపుకోని ఈ దేశంలో ఆవిర్భావం చెందిందన్నారు. నాటి నుండి నేటి వరకు రాజ్యాంగ రక్షణ, విద్యారంగంలో సమాన విద్యావకాశాలు, అందరికీ చదువు, చదువుకున్న వారికి ఉపాధి కల్పించాలని అనేక పోరాటాలు నడిపింది, ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడిందన్నారు. దేశంలో విద్యార్ధి హక్కులు కోసం పోరాటం చేసి విద్య ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణ, కషాయికరణ వ్యతిరేకంగా నిఖరమైన విద్యార్ధి ఉద్యమాలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నడుపుతుందని వెల్లడించారు. చదువులలో మూఢ విశ్వాసాలు నింపి విద్య రంగంను విద్వేషాలు రెచ్చగోడుతుందని బిజెపి విధానాలుపై పోరాడలన్నారు.

నూతన విద్యావిధానం పేరుతో ప్రభుత్వ విద్యారంగంలో కార్పొరేట్ శక్తులను, విదేశీ యూనివర్శీటీలను తీసుకుని వచ్చి దేశ విద్యారంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తుందని పేర్కొన్నారు. యూనివర్శీటీ లలో ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేస్తున్నారని, రాజ్యాంగ హక్కులు హరిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా విద్య విధానం మార్పులు చేశారని అన్నారు. అనంతరం కె.వి.పి.ఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలబ్ బాబు ప్రసంగిస్తూ బిజెపికి వ్యతిరేకంగా పోరాడటమే విద్యార్ధుల ముందున్న అసలైన కర్తవ్యమన్నారు. విద్యాసంస్థలలో సామాజిక న్యాయం, రిజర్వేషన్లు ,విద్యార్ధులపై వివక్ష వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు.

అదే విధంగా డి.వై.ఎఫ్.ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాలలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగాలను తీసివేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగం పెరిగిందని చదివిన చదువుకు చేసే ఉద్యోగాలకు పొంతన లేదన్నారు. భవిష్యత్తులో ఎస్.ఎఫ్.ఐ -డి.వై.ఎఫ్.ఐ కలసి విద్యార్థి నిరుద్యోగ సమస్యపై కలసి పోరాడతామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఎం.మమత, కె.అశోక్ రెడ్డి, సభ్యులు లెనిన్ , రమ్య హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు స్టాలిన్ , నాగేందర్, సాయి , సలీం ,అజయ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News