Friday, December 20, 2024

బిజెపి నాయకులకు తగిన బుద్ధి చెబుతాం

- Advertisement -
- Advertisement -

మక్తల్ : మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చే స్తూ, రాజకీయ పబ్బం గడుపుతున్న బిజెపి నాయకులకు త్వర లో జరిగే ఎన్నికల్లో డిపాజిటు గల్లంతు చేసి తగిన బుద్ధి చెబుతామని మార్కెట్ మాజీ ఛైర్మన్ పి.నర్సింహాగౌడ్, బిఆర్‌ఎస్ మ ండల అధ్యక్షులు మహిపాల్‌రెడ్డి అన్నారు.

శనివారం మక్తల్‌లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలను దృ ష్టిలో ఉంచుకొని పత్రికల్లో కనిపించాలనే తాపత్రయంతోనే బిజె పి నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. జి ంకల నుంచి పంటలను రక్షించేందుకు గానూ త్వరలోనే ప్రత్యేకంగా పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీ సుకుంటున్నప్పటికీ, వ్యక్తిగత లాభం కోసం బిజెపి నాయకులు పాకులాడుతున్నారన్నారు.

నాలుగో సారి కూడా మక్తల్ ఎమ్మెల్యేగా చిట్టెం రామ్మోహన్‌రెడ్డి గెలుపు తథ్యమని, బిజెపికి డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఇప్పటికైనా కుటిల రాజకీయాలకు స్వస్తి చెప్పాలని, లేనిచో ప్రజలే తరిమికొడతారన్నారు. సమావేశంలో కావలి శ్రీహరి, అమరేందర్‌రెడ్డి, మొగులప్ప, చిన్న హన్మంతు, షాలం, జుట్ల శంకర్, నర్సింహారెడ్డి, శివారెడ్డి, మధు, బండారి ఆనంద్, జుట్ల సాగర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News