Friday, November 15, 2024

జ్ఞాన ప్రధాతకు సముచిత స్థానం ఇద్దాం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఖమ్మం జిల్లా జ్ఞానా ప్రధాత గెంటాల నారాయణ రావు విగ్రహం ఏర్పాటు లోనూ, కళాశాల అభివృద్థి లోనూ తమ ప్రభుత్వం కీలక భూమిక నిర్వహిస్తుందని సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం స్థాని క యస్‌ఆర్ బిజీఎన్‌ఆర్ కళాశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పూర్వ విద్యార్థుల కన్వినర్ నల్లమోతు తిరుమల రావు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఆర్ బిజిఎన్‌ఆర్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రారంభ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, కళాశాల అభివృద్థి కొరకు మంత్రి అజయ్ కుమార్ 15లక్షలు మంజూరు చేశారని, పూర్వ విద్యార్థులు చేసిన తీర్మాణాలు పరిష్కారం కొరకు కృషిచేస్తామని అన్నారు.

ఇల్లెందురోడ్డుకు గెంటాల నారాయణ రావు పేరు పెట్టాలని చేసిన తీర్మానం అమలుతో పాటు ఆయన కాంస్య విగ్రహంకు అయిన ఖర్చులో సగం భరిస్తామని హామీనిచ్చారు. ఎస్‌ఆర్ ఆండ్ బిజీఎన్‌ఆర్ కళాశాల అభివృద్థి లో గానీ, కళాశాలను యూనివర్సిటీగా అప్ గ్రేడ్ చేయాలనే డిమాండ్ కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఇదే కళాశాలలో చదివి ఈస్థాయికి ఎదిగిన మేము కళాశాల సమస్యల పరిష్కారం లో తమతో పాటు ఉంటామని పూర్వ విద్యార్థులకు వాగ్ధానం చేశారు. కార్పోరేటర్ కర్నాటి కృష్ణ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల కోరికలు మంత్రిసహాకారం తో పరిష్కారం చేస్తామని హామీ నిచ్చారు. కార్పోరేషన్‌లో అవసరమైన సహాకారం డిమాండ్ ల విషయంలో పూర్వ విద్యార్థుల వెంట ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ సభలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో డాక్టర్ శీలం పాపారావు, సయ్యద్ షౌకత్ అలీ, కత్తి నెహ్రూ గౌడ్, భోగ గిరి, వంజాకుల లక్ష్మీనారాయణ, మోత్కూ రి నాగేశ్వరరావు, డాక్టర్ ఎస్‌ఎ.పాషా, యం పుల్లయ్య, వి.ఆనంద్ కుమార్, అన్నపూర్ణ దేవి, అలవాల నాగేశ్వరరావు, కళాశాల లెక్చరర్ ఆర్ సీతారాం తదితరులు మాట్లాడారు. ఈ కళాశాల కు చెందిన పూర్వ విద్యార్థుల అందరిసహాకారం తో ముందుకు పోవాలని పూర్వ విద్యార్థుల సమ్మేళనం తీర్మానం చేసింది. సమావేశంలో సమన్వయ సమితి నాయకుడు సయ్యద్ షౌకత్ ఆలీ సమావేశం చేసిన తీర్మాణాలు ప్రకటించారు.

యస్ ఆర్ బిజీఎన్‌ఆర్ కళాశాల ను యూనివర్సిటీ గా అప్ గ్రేడ్ చేయాలని, కళాశాలకు మిగిలి ఉన్న భూమి సెంటుకూడా ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని, మహాదాత గెంటేల నారాయణరావు బయోగ్రఫీ తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో తేవాలని, ఇల్లేందు రోడ్ కు గెంటాల నారాయణ రావు మార్గంగా నామాకరణం చేయాలని, నిలువెత్తు నారాయణ రావు కాంస్య విగ్రహం ఇల్లేందు క్రాస్ రోడ్స్ నందు ఏర్పాటు చేయాలని, బొటానికల్ గార్డెన్ ను నారాయణ రావు స్మ్రతి వనంగా నామాకరణం చేయాలని, ప్రతి ఎటా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించాలని, కళాశాల అభివృద్థికి నిరంతర కృషి సల్పాలని తీర్మాణాలుచేశారు. కళాశాల భవిష్యత్తు తరాలకు ప్రపంచ స్థాయి విజ్ఞాన భాండాగారం గా రూపుదిద్దుకొనే విధంగా తీర్చి దిద్దాలని తీర్మానించారు

  • పూర్వ విద్యార్థుల సమాలోచన సమితి ఏర్పాటు

కళాశాల అభివృద్థి, ఆస్తుల పరిరక్షణ తదితర అంశాలను ముందుకు తీసుకుని వెళ్లడానికి యస్‌ఆర్ బిజీఎన్‌ఆర్ పూర్వ విద్యార్థుల సమాలోచనా సమితి ఏర్పాటు చేశారు. ఈ సమితికి ఈక్రింది కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. నూతన కార్యవర్గం నల్లమోతు తిరుమల రావు కో-ఆర్డినేటర్ గా, డాక్టర్ శీలం పాపారావు, సయ్యద్ షౌకత్ ఆలీ, కత్తి నెహ్రూ, భోగ గిరి కో-కన్వినర్ లుగా,వి.మనోహర రాజు, వంజాకుల లక్ష్మీనారాయణ, ఊడుగు వెంకటేశ్వరరావు, మోత్కూరి నాగేశ్వరరావు, నల్లమల్ల వెంకటేశ్వరరావు, గోపిశెట్టి వెంకటేశ్వరరావు, డాక్టర్ ఎస్ ఎ పాషా,యం పుల్లయ్య, మణిభూషణా చారి, ఎం. గుట్టయ్య, బొడ్డు వెంకటేశ్వరరావు, రత్న, భూతం వసంతరావు, భూపాల్, జి.జనార్థన్ రావు, వి.ఆనంద్ తదితరులు 30మందితో కార్యవర్గం ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News