Thursday, January 23, 2025

రాబందులకు గుర్తింపును ఇద్దాం : ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : పర్యావరణ సమతుల్యంలో కీలకమైన రాబందులకు రావాల్సినంత గుర్తింపు రాలేదని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ అన్నారు. ‘ఇంటర్నేషనల్ వల్చర్ అవేర్నెస్ డే’ సందర్భంగా శనివారం ఆయన ట్వీట్ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో రాబందులది కీలకపాత్ర అని పేర్కొన్నారు. రాబందులకు రావాల్సినంత గుర్తింపు రాలేదు.. వాటిని చిన్నచూపు చూస్తున్నాం. స్కావెంజర్లు ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ విధానాన్ని మారుద్దాం.. రాబందులకు ఇవ్వాల్సిన గుర్తింపును ఇద్దాం అని సంతోష్ తన ట్విట్‌లో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News