Saturday, December 21, 2024

ప్రాచీన వారసత్వ సంపదను భావితరాలకు అందిద్దాం : సబిత

- Advertisement -
- Advertisement -

బాలాపూర్: ప్రాచీణ వారసత్వ సంపదను కాపాడి భవిష్యత్తు తరాలకు కానుకగా అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్‌గూడ కమాన్ నుంచి జిల్లెలగూడ వరకు రూ.85 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను ప్రారంభించిన అనంతరం మీర్‌పేట్ పాత గ్రామంలో రూ.40 లక్షలతో పున:నిర్మించిన బుర్జుమైసమ్మను శక్రవారం ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ శిథిలావస్ధకు చేరుకున్న 200 ఏండ్ల చరిత్ర కలిగిన బుర్జు మైసమ్మను 25 అడుగుల ఎత్తుకు పెంచి, ఆధునికమైన అన్ని హంగులతో సుందరీకరించడంతో మీర్‌పేట్‌కు మంచిరోజులు రావాలని ఆకాంక్షించారు.

యాదాద్రిని పునఃనిర్మాణం చేసి ముఖ్యమంత్రి కెసిఆర్ చరిత్రలో నిలిచిపోయాడిన, మైసమ్మతల్లి ఆశీస్సులతో నిర్మాణంలో భాగస్వాములైన ప్రతిఒక్కరి సహకారంతో పాతబుర్జును కాపాడుకుంటూ ఎటువంటి అవరోధాలు తలెత్తకుండా నూతన బుర్జు నిర్మాణ పనులను పూర్తిచేసినట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని సొంతఇంటిగా భావించి అన్ని రంగాల్లో తలమానికంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నానని, భవిష్యత్తులో బుర్జుమైసమ్మ షూటింగ్‌లకు కేంద్రంగా మారాలని ఆశాభావం వ్యక్తం చేవారు.ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలోని పురాతన దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని,దీంట్లో భాగంగానే మహేశ్వరంలోని మెట్లబావిని రూ.కోటితో అభివృద్ధి చేసిన రానున్న 3నెలల్లో ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు.

కెసిఆర్ పరిపాలనకు వరుణదేవుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, నియోజకవర్గంలోని మొత్తం 65గొలుసుకట్టు చెరువుల్లో నూతన కాలనీల ఆవిర్భావం కారణంగా గొలుసుకట్టు తెగిపోయిన కొన్ని చెరువులను తిరిగి అనుసంధానించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉన్న దార్శనీకృత పరిపాలన దక్షత కారణంగా ప్రసంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పధకం అయిన కాళేశ్వరాన్ని కేవలం 3 సంవత్సరాల వ్యవధిలోనే పూర్తిచేసి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్ ముడావత్ దుర్గ, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు తీగల మాధవిసాయినాధ్‌రెడ్డి, సిద్ధాల లావణ్యబీరప్ప, కీసర గోవర్ధన్‌రెడ్డి, ఉయ్యాల నవీన్‌గౌడ్, ఇంద్రావత్ రవినాయక్, సిద్ధాల లార్డ్ బీరప్ప, అక్కి మాధవిఈశ్వర్‌గౌడ్,జిల్లెల అరుణప్రభాకర్‌రెడ్డి, వేముల నర్సింహ్మా, గజ్జెల రాంచందర్, బొక్క రాజేందర్‌రెడ్డి, జిల్లా సౌందర్యవిజయ్, ఏనుగుల అనీల్‌యాదవ్, కోఆప్షన్‌సభ్యుడు పల్లె జంగయ్యగౌడ్, జిల్లా గ్రంధాలయ సంస్ధ డైరెక్టర్ పంతంగి మాధవి, కార్పొరేషన్ బిఆర్‌ఎస్‌పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్‌గౌడ్, మాజీ సర్పంచ్ పల్లె పాండుగౌడ్, నాయకులు రాజ్‌కుమార్, సిద్ధాల అంజయ్య, మహిళ అధ్యక్షురాలు పద్మరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News