Wednesday, November 6, 2024

బాలామృతం నాణ్యత మరింత పెంచుతాం

- Advertisement -
- Advertisement -
గుజరాత్‌లో మేడే రాజీవ్‌సాగర్ అమూల్ టెక్ హోంరేషన్ ఫ్యాక్టరీ సందర్శన: 

హైదరాబాద్ : రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే బాలామృతం నాణ్యత మరింత పెంచేందుకు ఐసిడిఎస్ కృషి చేస్తుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. రెండు రోజుల అహ్మదాబాద్, ఇండోర్ పర్యటనలో భాగంగా మొదటిరోజు గుజరాత్ రాష్ట్రం కైరా జిల్లా ఆనంద్ లోని అమూల్ టెక్ హోం రేషన్ ఫ్యాక్టరీని సందర్శించారు.ఈ సందర్భంగా మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ.. అమూల్ ఫ్యాక్టరీలో వినియోగిస్తున్న యంత్రాలు, సాంకేతికత అధునాతనమైనవని తెలిపారు. ఇక్కడ ఉపయోగించే రోస్టర్లతో నాణ్యమైన పోషకాహారం ఉత్పత్తితో పాటు గణనీయంగా కరెంటు చార్జీలు తగ్గించుకోవచ్చని వివరించారు.

ఇప్పటికే మనం ఆసియాలో అతి పెద్ద ప్లాంట్ ద్వారా బాలమృతం ఉత్పత్తి చేస్తున్నామని ఈ రోస్టర్లను మనం ప్రవేశపెడితే ఇంకా నాణ్యమైన పౌష్టికాహారం ఉత్పత్తి చేసి పిల్లలకు అందించి రాష్ట్రాన్ని పోషకాహార లోపం లేకుండా చేయవచ్చన్నారు. దీంతో పాటు వ్యయం తగ్గుతుందని తెలిపారు. గుజరాత్లో బాల శక్తి పేరుతో అందిస్తున్న బాలామృతం తయారీకి రూ. 75 ఖర్చు అవుతుంటే మన రాష్ట్రంలో రూ. 50 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఈ పర్యటనలో జీఎమ్ విజయలక్ష్మీ, ఎజీఎమ్ లు శ్రీనివాస్ నాయక్, ఎలమంద తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News