మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ స్థాయిలో రాష్ట్రానికి దక్కుతున్న ఘనత, గుర్తింపుల్లో అటవీ శాఖ కూడా ఉండటం చాలా గొప్ప విషయం అని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్ ఎం డోబ్రియాల్ అన్నారు. మంగళవారం అరణ్యభవన్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో అధికారులు, ఉద్యోగుల సమక్షంలో ఆయన జాతీయ జెండా ఎగుర వేశారు. దేశ విముక్తి కోసం ప్రాణాలు కోల్పోయిన వారందరినీ స్మరించుకోవటం, దేశంతో పాటు రాష్ట్ర అభివృద్దిలో ప్రతీ ఒక్కరూ పాల్పంచుకోవటం సమర యోధుల త్యాగాలకు దక్కే నిజమైన గుర్తింపు అన్నారు. తెలంగాణకు హరితహారం ద్వారా అటవీ శాఖకు దేశ వ్యాప్త గుర్తింపు దక్కిందని, ప్రతీ ఉద్యోగి, అధికారి ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని డోబ్రియల్ కోరారు. గతేడాది కాలంగా అరణ్యభవన్ లో పనిచేస్తూ మంచి ప్రతిభ కనపర్చిన ఉద్యోగులకు ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, నగదు బహుమతి అందజేశారు.
హరితహారం స్ఫూర్తిని కొనసాగిద్దాం : డోబ్రియల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -