Monday, December 23, 2024

బాల కార్మిక రహిత జిల్లాగా భద్రాద్రిని తీర్చి దిద్దుదాం

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం : ముస్కాన్‌లో భాగంగా బాల కార్మికులను సంరక్షించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరూ తమ గురుతర బాధ్యతగా భావించి కృషి చేయాలని జిల్లా ఎస్‌పి.డాక్టర్ వినీత్ పిలుపునిచ్చారు. శుక్రవారం సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత ఆరు సంవత్సరాలుగా మొత్తం 348 మంది బాల కార్మికులను సంరక్షించి వారి తల్లితండ్రులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. ఇందులో 277 మంది బాలురు, 71 మంది బాలికలను గుర్తించడం జరిగిందన్నారు. గత సంవత్సరం 52మంది బాలురు, 12 మంది బాలికలను మొత్తం 64 మంది బాల కార్మికులను సంరక్షించడం జరిగిందని తెలిపారు.

బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న అధికారులందరినీ ఎస్‌పి ప్రత్యేకంగా అభినందించారు. పరిశ్రమలో, వ్యాపార సముదాయాల వద్ద ఎవరైనా బాల కార్మికుల చేత పనులు చేయిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల కార్మికుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని సూచించారు. అనంతరం ఆపరేషన్ ముస్కాన్ పోస్టర్లను ఎస్‌పి తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆపరేషన్ ముస్కాన్ నోడల్ ఆఫీసర్ డిఎస్‌పి వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రవి, చైల్డ్ లైన్ అధికారి రాజ్‌కుమార్, ఎల్‌సిపిఒ శివకుమారి, జిల్లా విద్యాశాఖ సైదులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News