Monday, December 23, 2024

ప్రమాదరహిత సింగరేణిగా తీర్చిదిద్దుదాం 

- Advertisement -
- Advertisement -

యైటింక్లయిన్‌కాలనీ: రక్షణతో పాటు ఆరోగ్య భద్రతను బాద్యతగా తీసుకోవాలని, ప్రమాదరహిత సింగరేణిగా తీర్చిదిద్దుదామని సింగరేణి సంస్థ కార్పోరేట్ సేప్టీ జిఎం గురువయ్య పిలుపునిచ్చారు. నా భద్రత నాభాద్యత .. నా భద్రతే నా కుటుంబ భద్రత అనే నినాదంతో ఆర్‌జి3 ఏరియా ఓసిపి1 ప్రాజెక్టులో రక్షణ, భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఇట్టి కార్యక్రమంలో ఆర్‌జి3 జిఎం ఎన్ సుధాకర్‌రావ్, రామగుండం రీజియన్ సేఫ్టీ జిఎం ఎస్ సాంబయ్యతో కలిసి గురువయ్య పాల్గోని మాట్లాడుతూ విధులు నిర్వర్తించే సమయంలో రక్షణ ఎంత అవసరమో, ఆరోగ్యంపై శ్రద్ద అంతే అవసరమన్నారు. సంస్థలో పనిచేయడం ఒక అదృష్టంగా భావించాలన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వరంగ సంస్థలో లేని సదుపాయాలు సింగరేణి అందిస్తుందని, కంపెనీ అండగా ఉంటుందన్నారు.

మారుతున్న కాలానుగుణంగా మార్పు రావాలని, సంస్థలో జరిగే ప్రమాదాలను నివారించేందిగా ఉండాలన్నారు. ఆరోగ్యకరమైన జీవితం గడిపేలా చూసుకోవాలన్నారు. గనుల్లో జరిగే ప్రమాదాలతో పోల్చితే రోడ్డుపై, అనారోగ్యాలతో జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయనే బాధను వ్యక్తం చేశారు. అందుకే కంపెనీ వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు తెలిపారు. ఉద్యోగులు మంచి దృక్పదంతో రక్షణ, ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. అప్పుడే ప్రమాదరహిత సింగరేణిగా మారుతుందన్నారు.

ఆర్‌జి3 జిఎం ఎన్ సుధాకర్‌రావ్ మాట్లాడుతూ ప్రతి ఒకకరు భద్రతను భాద్యతగా భావించినప్పుడే కంపెనీలో ప్రమాదాలు నివారించి ప్రమాదరహిత సింగరేణిగా మార్చవచ్చు అన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి ఎన్ రాధకృష్ణ, ఏరియా రక్షణాధికారి సిహెచ్ వెంకటరమణ, ప్రాజెక్టు ఇంజనీర్ ఆర్ శ్రీనివాస్, మేనేజర్ ఉదయ్ హరిజన్, టిబిజికెఎస్ కార్యదర్శి జక్కుల దామోదర్‌రావ్, ప్రాజెక్టు కార్యదర్శి వేగోళపు మల్లయ్య, అధికారులు, ఉద్యోగులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News