Monday, December 23, 2024

మహనీయులను భవిష్యత్తు తరాలకు తెలియచేద్దాం

- Advertisement -
- Advertisement -

శామీర్‌పేట : మహనీయుల గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేద్దామని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేట మండల కేంద్రంలో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం మంత్రి మల్లారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. మహనీయుల చరిత్రలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరముందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దర్గ దయాకర్‌రెడ్డి, డిసిఎంఎస్ వైస్ ఛైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎంపిపి ఎల్లుభాయిబాబు, జడ్పీటిసి అనితలాలయ్య, శామీర్‌పేట మండల కో ఆప్షన్ సభ్యులు జహీర్, శామీర్‌పేట మండల రైతు బంధు అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు విలసాగరం సుదర్శన్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News