Wednesday, January 22, 2025

పాత పెన్షన్ పునరుద్ధరణపై సిఎంను కలుస్తాం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం కెసిఆర్ పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తారన్న సంపూర్ణ నమ్మకం ఉందని, త్వరలోనే సిఎం కెసిఆర్‌ను కలుస్తామని టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర,ఆగష్టు12వ తేదీన చలో హైదరాబాద్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆయన నాంపల్లిలోని టిఎన్జీఓ సెంట్రల్ యూనియన్ కార్యాలయంలో ఆవిష్కరించారు. టిఎన్జీఓ సంఘం తరఫున చలో హైదరాబాద్ కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని ఆయన తెలిపారు.

హైదరాబాద్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీ నుంచి 33 జిల్లాల మీదుగా చేపట్టబోయి పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్రకు, ఆగష్టు 12వ తేదీ జరిగే చలో హైదరాబాద్‌కు తమ యూనియన్ తరపున సంపూర్ణంగా మద్దతును అందిస్తామని ఆయన హామినిచ్చారు. ప్రతి ఉద్యోగి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, టిఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్, టిఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌హుస్సేనీ, సిపిఎస్ యూనియన్ రాష్ట్ర నాయకులు దర్శన్ గౌడ్, పోల శ్రీనివాస్, ఉపేందర్, రవి చంద్ర, శ్రావణ్ కుమార్ ,హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు, రమ, సంధ్య రాణి, హావిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News