Thursday, January 23, 2025

బిఆర్‌ఎస్ మోసాలపై ఉద్యమిద్దాం : బిజెపి ఎస్‌సి మోర్చా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : దళిత సమాజానికి బిఆర్‌ఎస్ తీరని అన్యాయం చేసిందని కొల్హార్ ఎంపి, రాష్ట్ర ఎస్‌సి మోర్చా ఇన్‌చార్జి మునిస్వామి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎస్‌సి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష అధ్యక్షతన పదాధికారులు, జిల్లా ఇన్‌ఛార్జీల, జిల్లా అధ్యక్షులతోఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడుతూ దశాబ్దకాలంగా దళితులకు బిఆర్‌ఎస్ చేస్తున్న మోసాలను దళిత సమాజంలో ఎండగట్టి దళితుల పక్షాన పోరాటానికి సిద్ధం కావాలని ఎస్‌సి మోర్చా నాయకులకు పిలుపునిచ్చారు. అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉండాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, జాతీయ ఎస్‌సి మోర్చా కార్యదర్శి కుమార్, వేముల అశోక్, నాయకులు కుమ్మరి శంకర్,కాంతికిరణ్, అంబేడ్కర్,బొట్ల శ్రీను,అంజిబాబు,చంద్రశేఖర్,శివుడు, శివాజీ,సత్యం, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News