Sunday, December 22, 2024

వ్యవసాయంపై అవగాహనతో ముందుకు సాగుదాం

- Advertisement -
- Advertisement -

రైతు ప్రతినిధులతో మంత్రి తుమ్మల

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయరంగం అభివృద్ధికోసం అన్ని అంశాలపైన స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుదామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.మంగళవారం సచివాలయంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వారి కార్యాలయంలో రైతు ప్రతినిధులు పలువురు కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా రైతు బంధు అమలు, ధరణి పోర్టల్ సమస్యలు, రైతులకు సాయిల్ హెల్త్ కారడ్స్, రుణమాఫీ, కౌలు రైతులకు పెట్టుబడి సాయం, కల్తీ విత్తనాలు, ఎరువులను ఏ విధంగా అరికట్టాలి, సేంద్రియ ఎరువులు, బహుళ అంతస్తుల వ్యవసాయ పద్దతులు, డ్రిప్, చిరు ధాన్యాల సాగుతో పాటు ప్రాసెసింగ్, మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్, మద్దతుధరలు, ఆయిల్ పామ్ సాగు- ప్రాసెసింగ్, శీతల గిడ్డంగులు ఏర్పాటు, తదితర అంశాల గురించి వివిధ కోణాలలో చర్చించారు.

భూసార పరీక్షలు ఆధారంగా పంటల సాగు మీద దృష్టి సారించడం ద్వారా రసాయన ఎరువులు వాడకం గణనీయంగా తగ్గే అవకాశముంది.పర్యవసానం గా భూసార పరిరక్షణ కు అవసరం అయిన రీతిలో నేల భౌతిక ,రసాయన గుణాలు మెరుగు పడుతుంది అని రైతులు వారి అనుభవాలను మంత్రికి వివరించారు. మల్టీ లేయర్ క్రాపింగ్ ద్వారా ఒక స్థిరమైన ఆదాయం సంవత్సరం పొడవునా లభించే అవకాశం ఉందని, ఆ పద్దతులను ప్రవేశ పెట్టాలని మంత్రి గారిని కోరారు. కృషి విజ్ఞాన కేంద్రాలు భూసార పరీక్షలు, బహుళ అంతస్తుల వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు అవగాహన తో పాటు ఆచరించటం లో భాగస్వామ్యం అందుకునేలా చేయటం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని మంత్రి గారికి తెలియచేశారు మార్కెట్లో రైతులకు అన్యాయం జరుగకుండా మద్దతు ధర కనీసం దొరికేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసి పర్యవేక్షణ బాధ్యతలను నిజాయితీ గా నిర్వహించేలా చేయాలని, అదేవిధంగా పంటల ఉత్పత్తుల అదనపు విలువ చేకూరేలా ప్రాసెసింగ్ అవసరమని శీతల గిడ్డంగులు వసతి అవసరమైన రీతిలో కల్పించానలి విజ్ణప్తి చేశారు.

మంత్రి అన్ని అంశాలపైన సావధానంగా వినటమే కాకుండా ,ఒక రైతుగా తన అనుభవాలను కూడా ప్రతినిధులతో పంచుకున్నారు. నింతరం మనం అందరితో కలిసి అన్ని అంశాలగురించి చర్చల ద్వారా ఉమ్మడి అవగాహనతో ముందుకు సాగుదాం అని రైతు ప్రతినిధులతో పేర్కొన్నారు.ఈ సమావేవంలో జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, ఖమ్మం జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తెలంగాణ కిసాన్ సెల అధ్యక్షుడు అవిరానాష్ రెడ్డి, భూముఏల సమస్యలపై న్యాయ సలహాదారు ప్రొఫెసర్ నునిల్ , చేనేత సైసోటీ అధ్యక్షుడు ప్రొ.డి.నరసింహారెడ్డి , రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాస్త్రవేత్త అల్టస్ జానయ్య తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News