Wednesday, January 22, 2025

మన కన్నబిడ్డల్లా మొక్కలను కాపాడుకుందాం

- Advertisement -
- Advertisement -

వరంగల్ కార్పొరేషన్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం ఓసిటీలో నిర్వహించిన తెలంగాణ హరితోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మొక్కలు నాటారు. అనంతరం అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని తిలకంచి అక్కడే ఉన్న చిన్నారులకు తెలంగాణ హరితహారం ద్వారా అటవీ అభివృద్ధి జంతు సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై చిన్నారులకు ఫోటో గ్యాలరీని చూపిస్తూ ఎమ్మెల్యే వివరించారు. హరితోత్సవాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, హరితోత్సవం అనేది భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని గొప్ప కార్యక్రమం మన ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టి నిధులు కేటాయించారు.

అశోకుడు చెట్లు నాటించారు అని గత చరిత్రను పుస్తకాలలో చూసాం నేడు కెసిఆర్ నాయకత్వనా మళ్ళీ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం 10,822కోట్లతో హరితహారానికి కేటాయించడం జరిగింది. ఈ నగరంలో 30 నర్సరీలు ఏర్పాటు చేసుకున్నాం, దానిలో హరితహారం కోసం గొ ప్పగా ఉపయోగించుకుంటున్నాం. తూర్పులో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటుకుంటున్నాం. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో గొప్పగా ఈ హరితహార హరితోత్సవాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. భారతదేశ చరిత్రలో అశోకుడి తర్వాత ఆ చరిత్రను తిరగరాసింది కెసిఆర్ మాత్రమే.

ఈ రోజు కోసం కాకుండా రాబోవు తరాలు బాగుండాలి అని గొప్ప ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు హరితహారంలో అందరూ భాగస్వామ్యం అయ్యి మొక్కలు నాటాలి. -మన బిడ్డలను కాపాడుకున్నట్టు మొక్కలను కాపాడుకోవాలి అవి మన జీవన విధానానికి తోడ్పాటును అందిస్తుంది. అటవీశాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు,ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్‌తో పాటు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు,ముఖ్య నాయకులు,అటవీశాఖ అధికారులు, ప్రముఖులు,స్థానికులు హాజరై మొక్కలు నాటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News