Monday, January 20, 2025

పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రకృతిని కాపాడుకుందాం.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.. అని – ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ దేశాలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో ఆర్థిక ప్రగతి, సామాజిక, పర్యావరణ సుస్థిరత అంశంపై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో హైలెవల్ పొలిటికల్ ఫోరం సదస్సులో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. ‘మిషన్ లైఫ్’ వంటి కార్యక్రమాలతో.. ప్రత్యేక కార్యాచరణతో భారత్ ముందుకెళ్తోందని వెల్లడించారు. పర్యాటకాభివృద్ధిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ‘గోవా రోడ్ మ్యాప్’ ఆధారంగా అంతా కలిసి పనిచేద్దామని ఆయన సూచించారు. పదేళ్లుగా పర్యావరణ సుస్థిరత కోసం మోడీ సర్కారు కృషి చేసిందన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా జీవనవిధానాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసే ఉద్దేశంతో.. మిషన్ లైఫ్‌ను భారత్ ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో యుఎన్‌ఓ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు సాబా కొరోశీ, ఆర్థిక, సామాజిక మండలి అధ్యక్షురాలు లాషెజరా స్టోయేవాతోపాటుగా.. వివిధ దేశాల పర్యాటక శాఖ మంత్రులు పాల్గొన్నారు.
మహాత్ముడికి పుష్పాంజలి..
అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మహాత్మాగాంధీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పుష్పాంజలి ఘటించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి నార్త్ లాన్ గార్డెన్స్‌లో భారత ప్రభుత్వం అందజేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని యుఎన్‌ఓ ఏర్పాటు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News