Monday, December 23, 2024

కరెన్సీ నోట్లపై దేవుళ్ల చిత్రాలు ఉంచుదాం

- Advertisement -
- Advertisement -

Let's put pictures of gods on currency notes

ప్రధాని మోడీకి కేజ్రీవాల్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరుదైన విజ్ఞప్తి చేశారు. కొత్త కరెన్సీ నోట్లపై మహాత్ముడి చిత్రంతోపాటు లక్ష్మి, విఘ్నేశ్వరుడి దేవతా రూపాలను ఉంచాలని కోరారు. కొత్త కరెన్నీ నోట్లపై దేవతల చిత్రాలు ఉంచడం వల్ల దేశం అభివృద్ధి మార్గంలో పయనించేందుకు ఉపయోగపడుతుంది. మనం శ్రమించినా దైవం ఆశీశ్శులు లేకపోతే మన ప్రయత్నాలు ఫలించవు. అందుకే నోట్లపై వారి రూపాలు చిత్రించాలని ప్రధాని మోడీని అభ్యర్థిస్తున్నాను. ఇండోనేషియాలో ముస్లిం జనాభా అధికంగా ఉన్నప్పటికీ ఆదేశం నోట్లపై గణేశుడి చిత్రం ఉంటుంది. ఇండోనేషియానే చేయగలిగినప్పుడు మనవల్ల ఎందుకు కాదు? డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తుండటంతో దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు మన ప్రయత్నాలతోపాటు దేవుడి ఆశీశ్శులు చూడా అవసరం అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దీనిపై త్వరలో ప్రధాని మోడీకి లేఖ రాస్తానని వెల్లడించారు.

కేజ్రీవాల్ కొత్త ముసుగు ధరించారు : బీజేపీ
‘ దేవుళ్ల గురించి ఆప్ నేతల మాట తీరు వేరేగా ఉండేది. వారు ఇంకా పార్టీ లోనే కొనసాగుతున్నారు. ఎన్నికల వేళ ఇప్పుడు కొత్త యత్నాలు చేస్తున్నారు. రామ మందిరాన్ని వ్యతిరేకించిన వారు ,కశ్మీరీ పండిట్ల వలసలు అబద్ధమని వ్యాఖ్యానించిన వారు ఇప్పుడు కొత్త ముసుగు ధరించారు. ప్రస్తుతం కేజ్రీవాల్ రాజకీయాలు యూ టర్న్ తీసుకొంటున్నాయి.’ అని బీజేపీ నేతలు కేజ్రీవాల్ సూచనను తీవ్రంగా విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News