Saturday, December 28, 2024

బిసి కులగణన సాధనకై సమరభేరి మోగిద్దాం

- Advertisement -
- Advertisement -

మా వాటా మాకు దక్కాల్సిందే..లేదంటే దేశంలో మరో మహామండల్ ఉద్యమం
జాతీయ ఓబిసి మహాసభలో బిసి నేతల వెల్లడి

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో బిసిల సమగ్ర కులగణన చేపట్టాలని బిసి నేతలు డిమాండ్ చేశారు. బిసిలకు రావాల్సిన వాటా బిసిలకు దక్కాలంటే దేశంలో మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైతే దేశ వ్యాప్తంగా బిసిలంతా ఐక్యమై మరో మహామండల్ ఉద్యమం తీసుకువస్తామని జాతీయ బిసి సంఘాల నేతలు హెచ్చరించారు. సోమవారం తిరుపతి పట్టణంలోని రాష్ట్రీయ ఓబిసి మహాసంఘ్, అఖిల భారత బిసి ఫెడరేషన్, తెలంగాణ, ఆంధ్ర బిసి సంక్షేమ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మహతి ఆడిటోరియంలో ఆఖిల భారత జాతీయ ఓబిసి మహాసభను పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఈ మహాసభకు దేశంలోని నలుమూలల నుంచి వందలాది మంది బిసి ప్రతినిధులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల నుండి జాతీయ బిసి నేతలు పాల్గొన్నారు. బిసి కమిషన్ జాతీయ చైర్మన్ హన్సరాజ్ గంగారాం అయర్, మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ఎంఐఎం అధ్యక్షులు ఎంపి అసదుద్దీన్ ఓవైసి, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్రీయ ఓబిసి మహాసంఘ్ అధ్యక్షులు ప్రొఫెసర్ భభన్ రాంతైవాడే ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఓబిసిల సంక్షేమానికి ప్రధాని కట్టుబడి ఉన్నారని జాతీయ బిసి కమిషన్ చైర్మన్ హన్సరాజ్ అయర్ పేర్కొనగా, ఓబిసి ఉద్యమానికి ఎంఐఎం అండగా ఉంటుందని ఎంపి అసదుద్దీన్ ఓవైసి అన్నారు. జాతీయ స్థాయిలో బిసి కులగణన తప్పనిసరి చేస్తూ పార్లమెంట్‌లో చట్టం తేవాలని జస్లిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. బిసిలు యాచించి గాకుండా దేశంలో బిసిల రాజకీయాలు శాసించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కేసన శంకర్‌రావు, బైరి రవికృష్ణ, విక్రంగౌడ్, కె. శ్రీనివాస్, శ్యాంకుర్మ, మణి మంజరి, బాలచారి, నరేష్, మహేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

OBCs

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News