Sunday, December 22, 2024

సోనియమ్మ రుణం తీర్చుకుందాం

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి నియోజకవర్గం రెడ్డిపేట రోడ్ షోలో పిసిసి సారథి రేవంత్ రెడ్డి

మనతెలంగాణ/రామారెడ్డి: కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించేందుకే పోటీ చేస్తున్నట్లు అందుకోస మే అధిష్ఠానం పంపిందని టిపిసిసి రాష్ట్ర అధ్యక్షు డు రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రెడ్డిపేటలో నిర్వహించిన రోడ్‌షోలో మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పో రాటాలు చేసి సాధించిన తెలంగాణలో ప్రజలు కష్టాలు పడుతున్నారని, ఆ కష్టాలు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియా గాంధీ వల్లేనే సాధ్యమైందని ఆమె రుణం తీర్చుకోవటానికైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకరావాలని రేంత్‌రెడ్డి కోరారు.

పేదప్రజలకు న్యాయం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కామారెడ్డి చుట్టు భూము లు కాపాడే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామని, గ్యాస్ ధరలు తగ్గిస్తామని భరోసా ఇ చ్చారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కామారెడ్డిలో తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు ఒకటేనని ఆ రెండు పార్టీలకు ఓ టు వేయవద్దని రేవంత్‌రెడ్డి సూచించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెడ్డిపేటలో రోడ్‌షోకు భారీగా జనాలు తరలిరావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సా హం వచ్చింది.ఈ సభలో భట్టుతండా సర్పంచ్ రె డ్డినాయక్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పా ర్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అద్దంకి దయాకర్,అరికెల నర్సారెడ్డి, యూసుఫ్ అలీ, జెడ్పి ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్‌రెడ్డి, సర్పంచ్ మహేందర్‌రెడ్డి మండలనాయకులు శ్రీనివాస్‌రెడ్డి,బండి ప్రవీన్, నాయిని నర్సింలు, కుమ్మరి శంకర్,కూడలి ఎల్లం, బోజునాయక్, చాకలి శ్రీను, చిన్నరాజులు, ధన్‌సింగ్, లింగం తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ రాకపోతే యువత అడవిబాట
హైదరాబాద్: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపో తే ఉద్యోగాలు రాని యువత అడవిలో అన్నలుగా మారే ప్రమాదం ఉందని టిపిసిసి చీఫ్ రేవంత్ రె డ్డి హెచ్చరించారు. ఉద్యోగాల కోసం ఈ రా ష్ట్రం లో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు పో రా డి అలసిపోయారన్నారు. మంగళవారం కాం గ్రె స్ పార్టీ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువత అడవిలో అన్నలుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఇక రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నా రు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులతో పాటు కౌలు రైతులకు సైతం భరోసా ఇస్తామని, ఉపాధి హామీ కూలీకి వెళ్లే ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్నారు. 2004లో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని తాము అధికారంలోకి వస్తే 24 గంటల నా ణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఇల్లు క ట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అం దజేస్తామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇ స్తామన్నారు. మంత్రివర్గంలో నలుగురు మహిళలకు స్థానం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని స ర్పంచ్‌లంతా ఆలోచన చేయాలని సొంత డబ్బుల తో అభివృద్ధి పనులు చేపడితే వాటి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News