- టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
ఫరూఖ్‌నగర్: గ్రామాల్లో పార్టీని అన్ని రంగాల్లో బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వెల్జర్ల గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో వీర్లపల్లి ముఖ్యఅతిధిగా హాజరై మాజీ ఎంపిటిసి నర్సింహారెడ్డి తదితరులతో కలిసి నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.
నూతన గ్రామ కమిటీ అధ్యక్షుడుగా శ్రీనివాస్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మట్ట వెంకటేష్, ఉపాధ్యక్షులుగా కృష్ణ, మహేష్, హరిచంద్ర, శివ, ప్రధాన కార్యదర్శిగా రమేష్, కోశాధికారిగా యాదయ్య, నవీన్ సభ్యులుగా బాల్‌నర్సింహా, ముకుంద, చిన్న శివరాజు, వెంకటేష్, లావణ్య,జంగయ్యలను ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్, బిజెపిల పాలనలో రాష్ట్రంలో, దేశంలో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, నిత్యవసరాల సరుకుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమయ్యాయని మండిపడ్డారు.
కరోనా కష్టాల నుండి బయట పడుతున్నామనుకున్న సమయంలో సరుకుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలను మరింత ఆర్థిక కష్టాలకు గురిచేసిందని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను నిలదీస్తున్న కాంగ్రెస్ పార్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, బిఆర్‌ఎస్, బిజెపిలు ఒక్కటే అని లోపాయికారి ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ , బిజెపిలకు ప్రజలే తగిన గుణ పాఠం చెబుతారని అన్నారు.
కాంగ్రెస్ జెండా పేద ప్రజలకు అండ అని కాంగ్రెస్ హస్తం బడుగు బలహీనవర్గాల నేస్తమని ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిల సారథ్యంలో దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగవేద్దామని, ఇందుకు ప్రతి ఒక్కరూ పార్టీ విజయానికి కృషి చేద్దాం, కాంగ్రెస్ కంచుకోటను తిరిగి స్వాధీనం చేసుకుందామని కార్యకర్తలకు సూచించారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగారం సుదర్శన్, నేతలు జంగయ్య, నర్సింలు, ఆంజనేయులు, రమేష్, చెన్నయ్య, వాల్యానాయక్, ప్రదీప్, బాబునాయక్ తదితరులు పాల్గొన్నారు.