Sunday, February 23, 2025

ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం… ఉద్యమ స్పూర్తితో పోరాడాలి : కోదండరామ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రజలు కోరుకున్న తెలంగాణ రావాలంటే తెలంగాణ ఉద్యమ స్పూర్తితో అందరు ఏకమై పోరాడాలని తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరామ్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో చెప్పిన అబద్దాలపై ఎన్నికలు వచ్చేదాక కొట్లాడాలని పిలుపునిచ్చారు. అమరుల చిహ్నాలపై ఎక్కడైనా అమరుల పేర్లు ఉంటాయని తెలంగాణలో మాత్రం ప్రభుత్వం పెట్టిన స్మారక చిహ్నంపై అమరుల పేర్లు ఎక్కడా లేవని కోదండరామ్ పేర్కొన్నారు. బిజెపి లాంటి పార్టీ అధికారంలోకి రాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాలని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News