Tuesday, April 29, 2025

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఎమ్మెల్యేలు,  పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కెసిఆర్ అభినందనలు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిద్దామని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష కోసం త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు. బిఆర్ఎస్ శాసనసభాపక్ష నేతను త్వరలో ఎన్నుకుంటామని గులాబీ బాస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News