Friday, December 20, 2024

కాంగ్రెస్ కంచుకోటను తిరిగి స్వాధీనం చేసుకుందాం

- Advertisement -
- Advertisement -

ఫరూఖ్‌నగర్ : కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న షాద్‌నగర్ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేసి తిరిగి కంచుకోటను స్వాధీనం చేసుకుందాం అని బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాల్‌రాజ్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొండన్నగూడ గ్రామంలో బిసి, ఎస్సి మండల శాఖ అధ్యక్షుడు బసప్ప, సాయిలుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

బిసి, ఎస్సి గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ బిసి సెల్ అధ్యక్షుడిగా చెన్నయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆర్ల కృష్ణయ్య లతో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అదేవిధంగా ఎస్సీ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షుడుగా రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రమేష్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అనంతరం బాల్‌రాజ్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలను అనేక సమస్యలకు గురిచేశాయని, నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెంచి సామాన్యులపై ధరల గుదిబండ వేశాయని, కరోన ఆర్థిక ఇబ్బందులను నుంచి తేరుకోక ముందే ప్రభుత్వాల వైఖరి వల్ల ధరల పెనుభారంతో మరింత ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారని, సామాన్యుల సమస్యలు పట్టని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, బిఆర్‌ఎస్, బిజెపి లను ఇంటికి సాగనంపుతారని, ఇక దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు శుక్రునాయక్, మాజీ ఎంపిటీసీ సురేష్‌గౌడ్, నేతలు కృష్ణయ్య, అంజయ్య, రాములు లక్ష్మయ్య, శివ, నరసింహా, మల్లారెడ్డి, రాజు, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News