- Advertisement -
సింహాల ఆవాసాలను పరిరక్షించుకుందాం…: ఎంపి సంతోష్ పిలుపు
హైదరాబాద్ : జంతువులను సంరక్షించుకుందాం.. అడవి రాజుగా పేరొందిన సింహాలను స్వేచ్ఛగా సంచరించనివ్వాలని, వాటి ఆవాసాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ‘వరల్డ్ లయన్ డే’ సందర్భాన్ని పురస్కరించకుని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. అడవుల్లో సంచరించే అపురూపమైన జీవులు అంతరించిపోకుండా రాబోయే తరాలకు సైతం ఆ జీవులు వెలుగొందేలా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉందన్నారు. ‘వరల్డ్ లయన్ డే’ సందర్భంగా మనమందరం వాటి సంరక్షణ కోసం నిననిద్దాం అని ఎంపి సంతోష్ మరోమారు పిలుపునిచ్చారు.
- Advertisement -